- Home
- Sports
- Cricket
- అశ్విన్, జడేజా ఉన్నా అతనికి కచ్ఛితంగా చోటు ఉండాల్సిందే... టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే...
అశ్విన్, జడేజా ఉన్నా అతనికి కచ్ఛితంగా చోటు ఉండాల్సిందే... టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే...
వెస్టిండీస్ టూర్‌లో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం అందుకుంది. రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో ఘనమైన రీఎంట్రీ ఇవ్వగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. అయితే ఈ ఇద్దరూ ఉన్నా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి టెస్టు టీమ్‌లో చోటు ఉండాలని అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే..

Kuldeep Yadav
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు టీమ్‌కి ఎంపిక చేసిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కి అవకాశం దక్కింది. కుల్దీప్ యాదవ్‌ని టెస్టు ఫార్మాట్ నుంచి పక్కనబెట్టేశారు సెలక్టర్లు...
Kuldeep Yadav
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని దృష్టిలో పెట్టుకుని కుల్దీప్ యాదవ్‌కి రెస్ట్ ఇచ్చారా? లేక సుదీర్ఘ ఫార్మాట్‌లో అక్షర్ పటేల్‌ని మూడో స్పిన్నర్‌గా కొనసాగించాలనే ఉద్దేశంతోనే అతన్ని తప్పించారా? అనేది తెలీదు..
‘రవీంద్ర జడేజా, అశ్విన్ ఇద్దరూ ఉన్నా కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో కచ్ఛితంగా ఉండాలి. అతను చాలా మంచి స్పిన్నర్. లెగ్ స్పిన్నర్లు చాలా అద్భుతమైన బౌలర్లు. ఎలాంటి బ్యాటర్‌కి అయినా వారి బౌలింగ్ ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్ కూడా చాలా అరుదు. టెస్టుల్లో అతని చైనామెన్ టెక్నిక్ టీమ్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా కుల్దీప్ యాదవ్ తనని తాను నిరూపించుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు..
kuldeep
అయితే టెస్టు మ్యాచుల్లో వారికి అవకాశం రావడం లేదు. ప్రస్తుతం అశ్విన్, జడేజా ఇద్దరూ పీక్ ఫామ్‌లో ఉండడంతో మిగిలిన స్పిన్నర్లు అవకాశం కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పలేదు. కుల్దీప్ యాదవ్ 8 మ్యాచుల్లో 34 వికెట్లు తీశాడు..
ఇప్పటికే మూడు సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. ఇదో అద్భుతమైన రికార్డు. అతన్ని సరిగ్గా వాడుకుంటే టీమిండియాకి టెస్టుల్లో పర్ఫెక్ట్ స్పిన్నర్‌గా మారతాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే..