చెన్నై టెస్టులో కుల్దీప్ యాదవ్ 'ట్రిపుల్ సెంచరీ' !
cricket records : ఎడమ చేతి మణికట్టు-స్పిన్, అరుదైన చైనామాన్ బౌలింగ్ శైలితో అద్భుతమైన బౌలర్ గా ఎదిగాడు కుల్దీప్ యాదవ్. చైనామ్యాన్ బౌలర్‌గా , కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ నుండి బంతిని ఎడమ చేతితో తిప్పగల అరుదైన సామర్థ్యం కలిగిన కుల్దీప్ రాబోయే బంగ్లాదేశ్ సిరీస్ లో మరోసారి అదరగొట్టాలనుకుంటున్నాడు.
Kuldeep Yadav-Rohit Sharma
Kuldeep Yadav triple century : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరో అద్భుతమైన రికార్డును సాధించనున్నాడు. 29 ఏళ్ల చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్వితీయమైన ట్రిపుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
Kuldeep Yadav
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ లో భారత ప్లేయర్లు అనేక రికార్డులను బద్దలు కొట్టనున్నారు. వారిలో కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రహ్మాస్త్రంగా మారనున్నాడు. టెస్ట్ సిరీస్‌లో భారత జట్టులోని ఈ స్పిన్నర్ ఒంటరిగా బంగ్లాదేశ్ జట్టు మొత్తాన్ని కుల్పకూల్చేయగలడు. అలాగే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రికార్డు సృష్టించనున్నాడు.
కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ రికార్డును సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కుల్దీప్ ఇప్పటివరకు 158 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 294 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టగలిగితే, అతను చరిత్ర సృష్టిస్తాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ యాదవ్ 300 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. టెస్ట్ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు చెన్నై, కాన్పూర్‌లలో జరుగుతాయి. ఇక్కడ స్పిన్నర్లకు పిచ్ నుంచి అద్భుతమైన సహాయం లభిస్తుంది. ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వికెట్ల వేటతో కుల్దీప్ యాదవ్ ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చైనామన్ స్పిన్ బౌలింగ్ కారణంగా కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు ముప్పుగా మారవచ్చు. కుల్దీప్ యాదవ్ టీమ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా నిలవవచ్చు. ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ 12 టెస్టు మ్యాచ్‌లు ఆడి 53 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 4 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
అలాగే, కుల్దీప్ వన్డే క్రికెట్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 172 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌లో 2 హ్యాట్రిక్‌లు సాధించిన రికార్డు కుల్దీప్ కు ఉంది. కుల్దీప్ భారత్ తరఫున 40 టీ20 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండు సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
Kuldeep Yadav
లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 953 వికెట్లు తీశాడు. రెండో స్థానంలో టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ 744 వికెట్లు తీశాడు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఉదయం 9:30 గంటలకు ఇరు దేశాల మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.