- Home
- Sports
- Cricket
- కుల్దీప్ యాదవ్‌ని ఎలా వాడాలో ఇప్పుడు తెలిసిందా... కేకేఆర్ మేనేజ్‌మెంట్‌పై మహ్మద్ కైఫ్ ఫైర్...
కుల్దీప్ యాదవ్‌ని ఎలా వాడాలో ఇప్పుడు తెలిసిందా... కేకేఆర్ మేనేజ్‌మెంట్‌పై మహ్మద్ కైఫ్ ఫైర్...
ఒకప్పుడు టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్, కొన్నాళ్లుగా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. టీమ్‌కి సెలక్ట్ అయినా తుదిజట్టులో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కేది కాదు. ఐపీఎల్‌లో అయితే కుల్దీప్ యాదవ్ పరిస్థితి మరీ దారుణం...

గౌతమ్ గంభీర్, కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్‌కి టీమ్‌లో ప్రాధాన్యం ఉండేది. 2017లో 12 మ్యాచులు, 18లో 16 మ్యాచులు ఆడి రెండు సీజన్లలో కలిసి 29 వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్...
అయితే గంభీర్ రిటైర్మెంట్ తర్వాత కేకేఆర్, కుల్దీప్ యాదవ్‌ని సరిగా వాడుకోవడం మానేసింది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల రాకతో కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టేసింది...
2019లో 9 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా 2020 సీజన్‌లో కేవలం 5 మ్యాచులు ఆడే అవకాశం దక్కింది. అందులోనూ వేసింది 12 ఓవర్లు మాత్రమే...
ఐపీఎల్ 2021 సీజన్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, గాయం కారణంగా సీజన్ మధ్యలోనే దూరమయ్యాడు...
తుదిజట్టులో చోటు ఇవ్వకపోతే, కనీసం వేలానికి వదిలేయాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్‌పై తన ఆవేదనను బహిరంగంగానే బయటపెట్టాడు కుల్దీప్ యాదవ్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కుల్దీప్ యాదవ్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టాడు కుల్దీప్ యాదవ్...
‘కుల్దీప్ యాదవ్ మరోసారి మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. కుల్దీప్ లాంటి ప్లేయర్‌ను సరిగ్గా వాడుకోవాలి. అతను చాలా ఎమోషనల్...
మ్యాచ్‌లో చోటు దక్కకపోయినా, టీమ్‌లో ఉండి బౌలింగ్ ఇవ్వకపోయినా చాలా ఫీల్ అవుతాడు. దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ కేకేఆర్ కెప్టెన్లుగా ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్‌ని సరిగా ట్రీట్ చేయలేదు...
అతన్ని ఇంట్లో కూర్చొబెట్టినట్టుగా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టేవాళ్లు. ఏ ప్లేయర్‌తో అయినా అలా ప్రవర్తిస్తే... మ్యాచ్ విన్నర్లు కూడా ఒత్తిడికి గురవుతారు...
ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌లో కుల్దీప్ యాదవ్‌కి ఆ ఒత్తిడి లేదు. అతనికి కావాల్సిన మెంటల్ స్ట్రెంగ్త్‌ని కోచ్ రికీ పాంటింగ్ అండ్ టీమ్ అందించారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...