కుల్దీప్ యాదవ్, మా ఆయుధం! అందుకే ఆడించడం లేదు.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వన్డే, టీ20ల్లో అదరగొడుతున్న జస్ప్రిత్ బుమ్రాని రెండేళ్ల పాటు దాచి పెట్టి, సౌతాఫ్రికా టూర్‌లో టెస్టుల్లో ప్రయోగించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటిదాకా జస్ప్రిత్ బుమ్రా 35 టెస్టులు ఆడితే అందులో 25కి పైగా విదేశాల్లో ఆడినవే. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ విషయంలోనూ ఇదే ఫార్ములా వాడబోతున్నాడట కెప్టెన్ రోహిత్ శర్మ..
Kuldeep Yadav
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో మొదటి రెండు వన్డేల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి కల్పించింది..
Kuldeep Yadav
ఆసియా కప్ 2023 టోర్నీలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలిచాడు. 2021 నుంచి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ టాప్‌లో నిలిచాడు కుల్దీప్ యాదవ్..
Kuldeep Yadav
‘కుల్దీప్ యాదవ్ రిథమ్ బౌలర్. ఆ విషయం మన అందరికీ తెలుసు. అతన్ని ఎక్కువగా ఆడిస్తూ ఉంటే, ఇంకా ఎక్కువగా వికెట్లు తీస్తుంటాడు. అయితే చాలా విషయాలు ఆలోచించి, కుల్దీప్ యాదవ్‌కి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం..
Kuldeep Yadav
ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ లాంటి వరల్డ్ కప్ ప్లేయర్లకు ఓ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. కుల్దీప్ యాదవ్‌ని ఏడాదిన్నరగా గమనిస్తూ వస్తున్నాం. ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టీమ్స్, అతని బౌలింగ్ యాక్షన్‌ని చదివేందుకు ప్రయత్నిస్తాయి..
Kuldeep Yadav
అందుకే కుల్దీప్ యాదవ్‌ని భద్రంగా దాచి పెట్టి, ఓ ఆయుధంలా ప్రయోగించాలని అనుకుంటున్నాం. నాకు తెలిసి ఇది మంచి నిర్ణయమే అనుకుంటున్నా.
వరల్డ్ కప్‌కి ముందు ఎలాగో రెండు ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఆడుతున్నాం. అతనికి రిథమ్ అందుకోవడానికి ఆ మ్యాచులు సరిపోతాయి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
Kuldeep Yadav
‘నేను కుల్దీప్ యాదవ్‌ని కొన్నేళ్లుగా చూస్తున్నా. అతను చాలా స్పెషల్ స్కిల్ సెట్ ప్లేయర్. కుల్దీప్‌కి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి, స్వేచ్ఛగా బౌలింగ్ చేయమని చెబితే చాలు, అదరగొట్టగలడు. వరల్డ్ కప్‌లో అతను టీమిండియాకి ట్రంప్ కార్డ్ అవుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్..