- Home
- Sports
- Cricket
- మూడేళ్ల తర్వాత ఆ ఫీట్ సాధించిన కుల్దీప్ యాదవ్... షేన్ వార్న్, చాహాల్ రికార్డు సమం...
మూడేళ్ల తర్వాత ఆ ఫీట్ సాధించిన కుల్దీప్ యాదవ్... షేన్ వార్న్, చాహాల్ రికార్డు సమం...
స్వదేశంలో భారత స్పినర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో భారత స్పిన్నర్ల నుంచి అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ అయితే రాలేదు. ఎట్టకేలకు ఢిల్లీలో తన సొంత ఐపీఎల్ గ్రౌండ్‌లో అదిరిపోయే స్పెల్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు కుల్దీప్ యాదవ్...

Kuldeep Yadav
టీ20 సిరీస్‌లో, మొదటి రెండు వన్డేల్లో సౌతాఫ్రికాని ఆలౌట్ చేయలేకపోయింది భారత జట్టు. అయితే వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన మూడో వన్డేలో 27.1 ఓవర్లలో 99 పరుగులకు చాప చుట్టేసింది సౌతాఫ్రికా. 4.1 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి, సౌతాఫ్రికా పతనంలో కీలక పాత్ర పోషించాడు...
Kuldeep Yadav
వాషింగ్టన్ సుందర్‌తో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయించిన కెప్టెన్ శిఖర్ ధావన్, 20వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్‌ని బౌలింగ్‌కి తీసుకొచ్చాడు. వస్తూనే అదిలే ఫెలూక్వాయోని క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్ యాదవ్, తన నాలుగో ఓవర్‌లో వరుస బంతుల్లో 2 వికెట్లు తీశాడు...
kuldeep yadav
ఫోర్టీన్‌కి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాతి బంతికే ఆన్రీచ్ నోకియాని క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో బంతికి ఇంగిడి వికెట్ కాపాడుకోవడంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ మిస్ అయ్యింది. మార్కో జాన్సెన్ వికెట్ తీసి ఆఖరి ఐదు వికెట్లలో నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.. 2019 తర్వాత వన్డేల్లో మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం కుల్దీప్ యాదవ్‌కి ఇదే తొలిసారి...
Image credit: PTI
సౌతాఫ్రికాపై వన్డేల్లో మూడు సార్లు నాలుగేసి వికెట్లు తీసిన స్పిన్నర్‌గా షేన్ వార్న్, యజ్వేంద్ర చాహాల్ రికార్డులను సమం చేశాడు కుల్దీప్ యాదవ్.. ఓవరాల్‌గా వన్డేల్లో సౌతాఫ్రికాపై 10 ఇన్నింగ్స్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్ 24 వికెట్లు తీశాడు...
సౌతాఫ్రికాపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్. ఇంతకుముందు సునీల్ జోషీ 5/6, యజ్వేంద్ర చాహాల్ 5/22 ఐదేసి వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 4/18 గణాంకాలతో వారి తర్వాతి స్థానంలో ఉన్నాడు...
కుల్దీప్ యాదవ్ స్పెల్ కారణంగా 99 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా, వన్డేల్లో భారత జట్టుపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇంతకుముందు 1999లో నైరోబీలో జరిగిన వన్డేలో 117 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా, డబుల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరడం ఇదే మొదటిసారి...
ఓవరాల్‌గా సౌతాఫ్రికాకి ఇది వన్డేల్లో మూడో అత్యల్ప స్కోరు. 1993లో ఆస్ట్రేలియాపై 69 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా, 2008లో, 2022లో ఇంగ్లాండ్‌పై 83 పరుగులకి (రెండుసార్లు) ఆలౌట్ అయ్యింది.