MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పెళ్లైన రెండు రోజులకే టీమిండియాలోకి కెఎల్ రాహుల్... కనీసం ఆ ముచ్ఛట కూడా లేకుండానే...

పెళ్లైన రెండు రోజులకే టీమిండియాలోకి కెఎల్ రాహుల్... కనీసం ఆ ముచ్ఛట కూడా లేకుండానే...

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్, తన ప్రేయసి అథియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం చాలా సీక్రెట్‌గా జరిగింది. జనవరి 23న అథియాని పెళ్లాడిన కెఎల్ రాహుల్, మరో రెండు రోజుల్లో టీమిండియాలో తిరిగి కలవబోతున్నాడట...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jan 24 2023, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పెళ్లికి ముందు ఎంత కలిసి తిరిగినా, కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి, జర్మనీ టూర్‌లకి వెళ్లినా పెళ్లి తర్వాత ముచ్ఛటగా మూడు రాత్రులు జరపడం ఆనవాయితీ, ఆచారం. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే,టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
KL Rahul

KL Rahul

ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ విజయం టీమిండియాకి చాలా అవసరం. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఈ టెస్టు సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలిస్తే ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

37
KL Rahul

KL Rahul

గత ఏడాదిని టెస్టు కెప్టెన్‌గా ఆరంభించిన కెఎల్ రాహల్, 2022లో చివరి టెస్టుకి కూడా కెప్టెన్సీ చేశాడు. సౌతాఫ్రికా టూర్‌లో జోహన్‌బర్గ్ టెస్టులో తాత్కాలిక కెప్టెన్‌గా మారిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గాయపడడంతో 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి సారథ్యం వహించాడు...
 

47
KL Rahul

KL Rahul

టెస్టుల్లో కీలక సభ్యుడిగా మారిన కెఎల్ రాహుల్‌, ఇండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో కీలకంగా మారబోతున్నాడు. దీంతో పెళ్లైన రెండు రోజులకే కెఎల్ రాహుల్, బీసీసీఐ క్యాంపులో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనాల్సిందిగా సూచించదట టీమిండియా...

57
KL Rahul

KL Rahul

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నప్పటికీ, ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ముంబైలో ఘనంగా మ్యారేజ్ బ్యాష్ నిర్వహించాలని అనుకుంటోంది రాహుల్ అండ్ సునీల్ శెట్టి ఫ్యామిలీ... ఆ పార్టీకి క్రికెట్‌, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు...
 

67

అలాగే ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత అంటే పెళ్లైన నాలుగు నెలలకు అఫిషియల్‌గా హానీమూన్‌ కోసం మాల్దీవుల్లో వాలబోతున్నారు రాహుల్ అండ్ అథియా శెట్టి. అయితే ఈ హానీమూన్ కూడా ఎక్కువ కాలం ఏం ఉండదు. ఎందుకంటే జూలై నెలాఖరులో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఉంది...

77

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో 2 టెస్టులు గెలిస్తే... టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధిస్తుంది. దీంతో పెళ్లి తర్వాత హాడావుడిగా టీమిండియాలో చేరినట్టే, హానీమూన్‌ని కూడా త్వరగా ముగించుకుని మళ్లీ క్యాంపులో చేరాల్సి ఉంటుంది కెఎల్ రాహుల్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved