- Home
- Sports
- Cricket
- మా సామి శిఖరం... టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కెఎల్ రాహుల్, అశ్విన్, జడేజా...
మా సామి శిఖరం... టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కెఎల్ రాహుల్, అశ్విన్, జడేజా...
ఎమ్మెస్ ధోనీ తర్వాత టీమిండియాపై అంతటి ప్రభావం చూపించిన క్రికెటర్ ఎవ్వరైనా ఉన్నారా... అది నిస్సందేహంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీయే. యూత్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే...

మొహాలీలో జరిగే ఇండియా, శ్రీలంక టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్‌లో నూరో టెస్టు మ్యాచ్... ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్... భారత టీమ్ మేట్స్, విరాట్ కోహ్లీ గురించి ఏం చెబుతున్నారో ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించింది...
‘విరాట్ కోహ్లీ క్రీజులో ఉండే మాలో ఏదో తెలియని ఓ ఎనర్జీ ఉంటుంది. విరాట్ కోహ్లీ గెలిచినన్ని మ్యాచులు, మనదేశంలో మరో కెప్టెన్ గెలవలేకపోయారు...
విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అని చెప్పడానికి ఆయన సాధించిన విజయాలే సాక్ష్యం... అతనితో కలిసి ఆడడం, విరాట్ ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవడం, అన్నింటికీ మించి కోహ్లీ ఆటను అర్థం చేసుకునే విధానాన్ని గమనించడం వల్ల ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత క్రికెటర్ కెఎల్ రాహుల్...
‘విరాట్ కోహ్లీ భారత జట్టులో ఏం మార్పు తీసుకొచ్చాడంటే, ఓ విషయం గట్టిగా చెప్పొచ్చు. విరాట్ టీమ్ ఫిట్‌నెస్ స్టాండడ్స్‌ని పూర్తిగా మార్చేశాడు...
ఓ ప్లేయర్‌కి ఫిట్‌నెస్ ఎంత ముఖ్యంగా తాను నిరూపించి మరీ చూపించాడు. విరాట్ కెప్టెన్సీలో టీమిండియా కల్చర్‌లో చాలా పాజిటివ్ మార్పు వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...
విరాట్ కోహ్లీతో కలిసి అండర్ 19 వరల్డ్ కప్ 2008తో పాటు వన్డే వరల్డ్ కప్ 2019, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలు ఆడిన రవీంద్ర జడేజా కూడా తన పార్టనర్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు..
‘నేను విరాట్‌తో అండర్-19 రోజుల నుంచి ఆడుతున్నాను. నేను చాలా సార్లు కోహ్లీ గురించి చెప్పాను. ఇప్పుడు ఎప్పుడూ అదే చెబుతాను...
విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌ను ఒకేలా చూస్తాను. ప్రతీ గేమ్ అతనికి యుద్ధం లాంటిదే. అందుకే అన్ని మ్యాచు్లోనూ విరాట్ విజయమే లక్ష్యంగా ఆడతాడు.
ఆఖరి నిమిషం వరకూ ఓటమిని ఒప్పుకోని విరాట్ ఎనర్జీ, హర్డ్ వర్క్... టీమ్‌లో ఎంతో స్పూర్తిని నింపుతాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా...