MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంకా కోలుకోని కెఎల్ రాహుల్... వికెట్ కీపింగ్ చేయడం కష్టమే! ఇషాన్ కిషన్‌కి బంపర్ ఆఫర్...

ఇంకా కోలుకోని కెఎల్ రాహుల్... వికెట్ కీపింగ్ చేయడం కష్టమే! ఇషాన్ కిషన్‌కి బంపర్ ఆఫర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా, సూపర్ 4 రౌండ్ సమయానికి కోలుకుంటాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు..  

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Aug 29 2023, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో 199 పరుగులు చేయడమే కాకుండా, 40 ఓవర్ల వరకూ ఫీల్డింగ్ కూడా చేశాడు. కాబట్టి అయ్యర్ ఫిట్‌నెస్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది బీసీసీఐ..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shreyas Iyer

Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడంతో టీమిండియాకి నాలుగో స్థానంలో వచ్చిన సమస్య తొలగిపోయినట్టే. అయ్యర్ ఆ ప్లేస్‌లో అతికినట్టు సరిపోతాడు. అయ్యర్, రాబోయే మూడు నెలల పాటు గాయపడకుండా టీమ్‌కి అందుబాటులో ఉంటే చాలు..

36

అయితే కెఎల్ రాహుల్ మాత్రం ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెఎల్ రాహుల్ తొడకండరాలు పట్టుకున్నాయి. గాయానికి సర్జరీ కూడా చేయించుకున్న రాహుల్, వన్డే వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్..
 

46
KL Rahul

KL Rahul

అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో వికెట్ కీపింగ్ చేయడానికి ఇంకా ఇబ్బందిపడుతున్నాడు కెఎల్ రాహుల్. హర్మ్‌స్ట్రింగ్ గాయం పూర్తిగా కోలుకోకుండా ఆడితే, మళ్లీ తిరగబెడుతుంది. ఇప్పుడు నాలుగు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, గాయం తిరగబెడితే ఈసారి 8 నెలల వరకూ ఆటకు దూరం కావాల్సి ఉంటుంది..

56

కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్‌ని ఆడించక తప్పదు. వన్డేల్లో ఓపెనర్‌గా మంచి రికార్డు ఉన్న ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు...

66

ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా ఆడించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌ని మళ్లీ పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఒకరు, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలి. వరల్డ్ కప్‌కి నెల ముందు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తే, అది టీమ్‌ కాంబినేషన్‌ని దెబ్బ తీసే ప్రమాదమూ లేకపోలేదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved