MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పెళ్లి కోసం బ్రేక్ కావాలన్నాడు! కెఎల్ రాహుల్ మ్యారేజ్ అయిపోయిందా... లేక రెస్ట్ పేరుతో తప్పించారా...

పెళ్లి కోసం బ్రేక్ కావాలన్నాడు! కెఎల్ రాహుల్ మ్యారేజ్ అయిపోయిందా... లేక రెస్ట్ పేరుతో తప్పించారా...

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు కెఎల్ రాహుల్‌కి కూడా చోటు దక్కలేదు. విరాట్, రోహిత్ టీ20 ఫార్మాట్‌కి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపించగా కెఎల్ రాహుల్ పెళ్లి కోసం బ్రేక్ కావాలని కోరినట్టు వార్తలు వచ్చాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jan 10 2023, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Athiya Shetty, KL Rahul

Athiya Shetty, KL Rahul

30 ఏళ్ల కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టితో చాలా రోజులుగా డేటింగ్‌ చేస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అథియా శెట్టితో కెఎల్ రాహుల్‌ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని టాక్ వినిపించింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Athiya Shetty, KL Rahul

Athiya Shetty, KL Rahul

పెళ్లి పనుల కోసం శ్రీలంకతో టీ20 సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే టీ20 సిరీస్ ముగిసింది. వన్డే సిరీస్ మొదలైంది. కెఎల్ రాహుల్ మొదటి వన్డేలో ఆడుతున్నాడు కూడా...

38
Athiya Shetty, KL Rahul

Athiya Shetty, KL Rahul

అయితే ఇప్పటి దాకా కెఎల్ రాహుల్, అథియా శెట్టి పెళ్లి గురించి ఎలాంటి సమాచారం కానీ ఫోటో కానీ రాలేదు. కెఎల్ రాహుల్ పెళ్లి కోసం బ్రేక్ తీసుకున్నాడా? లేక అతని పేలవ ఫామ్ కారణంగా టీ20ల నుంచి తీసి పక్కనబెట్టారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి...

48

అథియా శెట్టితో కలిసి న్యూఇయర్ పార్టీలో సందడి చేసిన కెఎల్ రాహుల్, మామ గారి కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాడు... ఎప్పుడూ మూడీగా ఉండే కెఎల్ రాహుల్ చిరు నవ్వులు చిందిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

58

తాజాగా కెఎల్ రాహుల్, అథియా శెట్టి జనవరి 21న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది...

68

న్యూజిలాండ్ సిరీస్ సమయంలో కెఎల్ రాహుల్ పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. సునీల శెట్టికి చెందిన కండల్లా విల్లాలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరగనుందని, కేవలం అతి కొద్ది మంది ఆత్మీయ బంధుమిత్రుల మధ్య పెళ్లి తంతు ముగించాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...

78
Image credit: KL Rahul/Facebook

Image credit: KL Rahul/Facebook

2022 ఏడాదిని టీమిండియా కెప్టెన్‌గా మొదలెట్టిన కెఎల్ రాహుల్, ఆఖరి మ్యాచ్ కూడా కెప్టెన్‌గానే ముగించాడు. బంగ్లాదేశ్ టూర్‌లో ఆఖరి వన్డేకి రెండు టెస్టులకి కెప్టెన్సీ చేశాడు కెఎల్ రాహుల్... అయితే హార్ధిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చిన బీసీసీఐ, కెఎల్ రాహుల్‌ని ఆ పొజిషన్ నుంచి తప్పించింది..

88
KL Rahul

KL Rahul

ప్రస్తుతం వస్తున్న పెళ్లి వార్తల నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా కెఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం కష్టమే. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో కెఎల్ రాహుల్ బరిలో దిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్ యాక్సిడెంట్‌లో గాయపడడంతో కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... 

About the Author

CR
Chinthakindhi Ramu
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
CSK: మూడేళ్లుగా ప్లేఆఫ్స్ మిస్.. ఆరో ఐపీఎల్ ట్రోఫీ కోసం సీఎస్కే బిగ్ స్కెచ్
Recommended image2
ICC T20 Rankings: టీ20ల్లో నంబర్ 1.. అభిషేక్ శర్మ దెబ్బకు రికార్డులు షేక్
Recommended image3
Fastest T20 Fifty : 9 బంతుల్లో 50 పరుగులేంటి సామీ! టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved