MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Fastest T20 Fifty : 9 బంతుల్లో 50 పరుగులేంటి సామీ! టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరో తెలుసా?

Fastest T20 Fifty : 9 బంతుల్లో 50 పరుగులేంటి సామీ! టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరో తెలుసా?

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరు? ఏ అభిషేక్ శర్మనో లేదంటే వైభవ్ సూర్యవంశీనో ఈ రికార్డు నెలకొల్పి ఉంటారని అనుకుంటాం. కానీ కాదు… ఓ పసికూన టీం ప్లేయర్ పేరిట ఈ రికార్డు ఉంది.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 27 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అభిషేక్ దెబ్బ అదుర్స్
Image Credit : X@BCCI

అభిషేక్ దెబ్బ అదుర్స్

టీ20 అంటేనే ధనాధన్ క్రికెట్... తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుదే ఈ ఫార్మాట్ లో విజయం. అందుకే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లాంటి ఇండియన్ హిట్టర్లు టీ20 క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నారు... తాజాగా ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇవాళ (అక్టోబర్ 27, మంగళవారం) ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 లో టీమిండియా అద్భుత విజయం సాధించింది... ఓపెనర్ అభిషేక్ సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు.

కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ అదే ఊపుతో సెంచరీ కూడా పూర్తిచేసుకున్నాడు… కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా అభిషేక్ 11 సిక్సర్లు, 9 ఫోర్లతో కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. అతడు 297 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.

మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా తానేం తక్కువకాదు అన్నట్లగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు... కేవలం 19 బంతుల్లో 45 పరుగులు (4 సిక్సర్లు, 4 ఫోర్లు) చేశాడు. ఇలా ఓపెనర్లిద్దరు ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తిచేసింది టీమిండియా.

అయితే అభిషేక్ శర్మ తాజా ఇన్నింగ్స్ తో మరోసారి టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుపై చర్చ మొదలయ్యింది. ఎంత వేగంగా ఆడినా ఓ ఆటగాడి రికార్డును టీమిండియా క్రికెటర్లు బద్దలుకొట్టలేకపోతున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఎన్ని బంతుల్లో అర్థశతకం బాదాడు? ఇండియన్ క్రికెటర్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరు?
Image Credit : Social Media

టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరు?

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఏ టీమిండియా ప్లేయరో లేక ఆస్ట్రేలియా ఆటగాడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాది ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుగుతున్న పసికూన నేపాల్ ఆటగాడి పేరిట ఈ రికార్డు ఉంది. ఈ జట్టు ప్లేయర్ దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 2023 లో మంగోలియాపై జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనత సాధించాడు. 10 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా దీపేంద్ర సింగ్ నిలిచాడు.

34
టీమిండియా క్రికెటర్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఎవరిది?
Image Credit : Asianet News

టీమిండియా క్రికెటర్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఎవరిది?

ఇక టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల జాబితాలో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై కేవలం 12 బంతుల్లోనే అర్థశతకం బాదాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే సెకండ్ ఫాస్టెస్ట్, టీమిండియాలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన స్పెషల్ ఇన్నింగ్స్ ఇదే.

అయితే గురువు యువరాజ్ బాటలోనే అభిషేక్ శర్మ నడుస్తున్నాడు… కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రికార్డు ఇతడి సొంతం. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రికార్డు కూడా న్యూజిలాండ్ పైనే కావడం విశేషం. అంటే తాజా మ్యాచ్ లో కంటే ఓ బంతి తక్కువగానే ఆడి హాఫ్ సెంచరీ చేశాడన్నమాట.

44
అభిషేక్, వైభవ్ మధ్యే పోటీ...
Image Credit : X/BCCI

అభిషేక్, వైభవ్ మధ్యే పోటీ...

టీ20 క్రికెట్లో మరో విధ్వంసకర టీమిండియా ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆకాశమే హద్దుగా చెలరేగి వెలుగులోకి వచ్చిన ఇతడు చిన్న వయసులోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇతడు రికార్డుల మోత మోగిస్తున్నాడు... ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తాజాగా 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఔటై మరో ఫాస్టెస్ట్ హాప్ సెంచరీని మిస్సయ్యాడు.

ఇలా ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల మధ్యే పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరు నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ రికార్డును బద్దలుగొడతారో చూడాలి... అంటే కేవలం 9 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాలన్నమాట. అసాధ్యమైన ఈ రికార్డును సుసాధ్యం చేసేదెవరో.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసంతో న్యూజిలాండ్‌ చిత్తు.. భారత్ రికార్డు విజయం
Recommended image2
Abhishek Sharma: సిక్సర్ల తుపాను.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులు బ్రేక్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ
Recommended image3
IND vs NZ: ఉతికి ఆరేస్తున్న టీమిండియా బ్యాట‌ర్లు.. జ‌స్ట్ 29 బంతుల్లోనే 100 ప‌రుగులు
Related Stories
Recommended image1
IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసంతో న్యూజిలాండ్‌ చిత్తు.. భారత్ రికార్డు విజయం
Recommended image2
IND vs NZ: ఉతికి ఆరేస్తున్న టీమిండియా బ్యాట‌ర్లు.. జ‌స్ట్ 29 బంతుల్లోనే 100 ప‌రుగులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved