MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: ఒకే ఒక్క‌డు.. చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. రికార్డుల మోత !

KL Rahul: ఒకే ఒక్క‌డు.. చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. రికార్డుల మోత !

KL Rahul: సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మరే భార‌త బ్యాట్స్ మన్ 50కి మించి పరుగులు చేయ‌ని స‌మ‌యంలో రాహుల్ సెంచ‌రీ కొట్టాడు. 137 బంతుల్లో 101 పరుగులతో అద‌ర‌గొట్టి అరుదైన రికార్డులు సాధించాడు.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 27 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
KL Rahul

KL Rahul

KL Rahul Hits Hundred in Centurion: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 245 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.  భార‌త బ్యాట‌ర్స్ పెద్ద‌గా రాణించ‌ని సెంచూరియ‌న్ లో కేఎల్ రాహుల్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
KL Rahul

KL Rahul

మ‌రే బ్యాట‌ర్ కు సాధ్యం కానీ సెంచ‌రీల‌ను న‌మోదుచేశాడు. సెంచూరియన్ లో రెండు టెస్టు సెంచరీలు సాధించిన తొలి బ్యాట‌ర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ 137 బంతుల్లో 101 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉండ‌టం విశేషం. 

35

భార‌త్ జ‌ట్టు 107 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయిన త‌రుణంలో క్రీజులోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్.. లోయర్ ఆర్డర్ & టైలెండర్లతో భాగ‌స్వామ్యం నెల‌కొల్పి అద్భుతమైన సెంచరీని కొట్టాడు. దక్షిణాఫ్రికాలో ఒక భార‌త ప్లేయ‌ర్ చేసిన అత్యుత్త‌మ సెంచ‌రీల‌లో ఒక‌టిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఇది.
 

45

వన్డేల్లో ఓపెనింగ్.. మిడిలార్డర్, వికెట్ కీపింగ్; టెస్టుల్లో ఓపెనింగ్.. మిడిల్ ఆర్డర్, వికెట్ కీపింగ్; టీ20ల్లో ఓపెనింగ్, వికెట్ కీపింగ్.. ఇలా ఏ స్థానంలో ఉన్నా త‌న‌దైన స్టైల్లో కేఎల్ రాహుల్ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 
 

55

కేఎల్ రాహుల్ ఈ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో మ‌రో విశేషం.. ఎక్కువ ప‌రుగులు బౌండ‌రీల‌తో సాధించ‌డం. 79.20 శాతం (80 ప‌రుగులు) బౌండ‌రీల‌తో నే సాధించాడు. ఈ లిస్టులో శిఖ‌ర్ ధావ‌న్ టాప్ లో ఉండగా, 2018లో ఆఫ్ఘానిస్థాన్ పై సాధించిన 107 ప‌రుగుల‌లో 94 ప‌రుగుల‌ను బౌండ‌రీల‌తో వ‌చ్చాయి. అలాగే, న్యూజిలాండ్ పై వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ 2009లో 124* ప‌రుగుల‌లో 100 ప‌రుగులు బౌండ‌రీల‌తో సాధించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved