- Home
- Sports
- Cricket
- మావోడికి మస్తు టాలెంట్ ఉంది.. బ్యాకప్ చేస్తే తప్పేంటి! కెఎల్ రాహుల్‌పై గౌతమ్ గంభీర్...
మావోడికి మస్తు టాలెంట్ ఉంది.. బ్యాకప్ చేస్తే తప్పేంటి! కెఎల్ రాహుల్‌పై గౌతమ్ గంభీర్...
అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను విమర్శిస్తూ చీల్చి చెండాడుతూ ఉంటాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్న కెఎల్ రాహుల్‌ని వెనకేసుకు రావడం విశేషం...

Aakash Chopra-Venkatesh Prasad
పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతున్న కెఎల్ రాహుల్‌ని టీమ్ నుంచి తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ విషయం గురించి టీమిండియా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా ట్విట్టర్‌లో రచ్చ లేపి వదిలిపెట్టారు..
రెండో టెస్టు ముగిసిన తర్వాత టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయిన కెఎల్ రాహుల్, మూడో టెస్టు ఆడతాడా? అనేది అనుమానంగా మారింది. శుబ్‌మన్ గిల్‌ని టీమ్‌లోకి తీసుకురావడానికే రాహుల్ వైస్ కెప్టెన్సీని తొలగించారని హర్భజన్ సింగ్ కూడా అభిప్రాయపడ్డాడు...
KL Rahul-Gautam Gambhir
‘కెఎల్ రాహుల్‌ని టీమిండియా నుంచి తప్పించడం కరెక్ట్ కాదు. ఒకటి రెండు మ్యాచుల పర్ఫామెన్స్ ఆధారంగా ప్లేయర్లను పక్కనబెట్టడం సరైన పద్ధతి కాదు. ప్రతీ ప్లేయర్ కెరీర్‌లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి...
KL Rahul
ఫామ్‌లో లేనప్పుడు ప్లేయర్లకు సపోర్ట్ అవసరం. ఎవ్వరూ, ఏ క్రికెట్ పండిట్ కూడా కెఎల్ రాహుల్ బాగా ఆడడం లేదని, టీమ్ నుంచి తప్పించాలని చెప్పడం కరెక్ట్ కాదు.. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టీమ్ సపోర్ట్ ఉండాలి..
Image credit: Getty
రోహిత్ శర్మనే చూడండి. అతను ఫామ్‌లో లేనప్పుడు టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. రోహిత్ టెస్టు కెరీర్ ఎప్పుడు మొదలైంది. ఎన్నేళ్లకు మొదలైంది.. కెరీర్ ఆరంభంలో అస్సలు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాడు రోహిత్.. ఇప్పుడు ఎలా ఆడుతున్నాడో చూశారుగా..
KL Rahul-Dravid
కెఎల్ రాహుల్ కూడా అంత టాలెంటెడ్. అతని దగ్గర ఎంత టాలెంట్ ఉందో అందరికీ తెలుసు. రోహిత్‌లా రాహుల్ కూడా టీమిండియాకి స్టార్ ప్లేయర్ అవుతాడు. అతనికి అండగా నిలుస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ సరైన పనే చేస్తోంది. అతను గొప్ప ప్లేయర్...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...
KL Rahul
కెఎల్ రాహుల్ విషయంలో పరుగులు చేయకపోయినా బ్యాక్ చేయాలని చెబుతున్న గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడలేదని విమర్శిస్తున్నారు అభిమానులు. కేవలం ఐపీఎల్‌లో తన టీమ్‌కి ఆడుతున్నాడనే ఉద్దేశంతో రాహుల్‌ని వెనకేసుకురావడం కరెక్ట్ కాదని అంటున్నారు..