MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఆరెంజ్ క్యాప్ సేఫేనా రాహుల్ భాయ్... ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టు ఇక! టీమిండియా ఓపెనర్‌పై...

ఆరెంజ్ క్యాప్ సేఫేనా రాహుల్ భాయ్... ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టు ఇక! టీమిండియా ఓపెనర్‌పై...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే తప్పుకుంది. 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుస్తారని ఆశపడిన 130 కోట్ల భారతీయుల ఆశలపై నీళ్లు జల్లుతూ...  ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని అందుకుంది భారత జట్టు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విఫలమైన కెఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 10 2022, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
KL Rahul

KL Rahul

ఈ ఏడాదిలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత గాయపడ్డాడు. గాయం కారణంగా రెండు నెలల పాటు టీమిండియాకి దూరమైన కెఎల్ రాహుల్‌ని నేరుగా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Image credit: Getty

Image credit: Getty

ఐపీఎల్ 2022 సీజన్‌లో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టీమిండియాకి కీలక బ్యాటర్‌ అవుతాడనే ఉద్దేశంతో అతనికి వైస్ కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది మేనేజ్‌మెంట్. అయితే ఆసియా కప్ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, టీమిండియా సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టడానికి కారణమయ్యాడు...

39

తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కెఎల్ రాహుల్ ఫెయిల్యూర్ కొనసాగింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు...
 

49

పసికూనలపై హాఫ్ సెంచరీలు బాదగానే రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడని భ్రమపడిన టీమిండియా మేనేజ్‌మెంట్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతన్ని బరిలో దిగింది. కీలక మ్యాచ్‌లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రాహుల్. రెండో ఓవర్‌లోనే వికెట్ పడడంతో బ్యాటింగ్ పిచ్‌లో పవర్ ప్లేలో 38 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...
 

59
KL Rahul

KL Rahul

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్... ఆఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి పసి కూనలతో జరిగిన మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు... ఈసారి కూడా బంగ్లా, జింబాబ్వేలపై హాఫ్ సెంచరీలు చేశాడు...

69
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇస్తూ, వరుసగా మూడు సీజన్లలో 600+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. 2020 సీజన్‌లో 672 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాహుల్, 2021, 2022 సీజన్‌లోనూ క్యాప్ రేసులో నిలిచాడు...

79
Image credit: PTI

Image credit: PTI

కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ మీద పెట్టిన శ్రద్థ, అంకితభావం... టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందించడంలో చూపించి ఉంటే... బాగుండేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రూ.17 కోట్లు తీసుకున్న కెఎల్ రాహుల్, టీమిండియా తరుపున ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌తో ఏడాదికి రూ.5 కోట్లు తీసుకుంటున్నాడు.  త్వరలో A+ కాంట్రాక్ట్ దక్కే అవకాశం కూడా పుష్కలంగా ఉంది.
 

89
KL Rahul

KL Rahul

మ్యాచ్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయంతో కలిపి దాదాపు  ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంతో సమానంగా రాహుల్ జేబులోకి వెళ్తోంది. బ్రాండ్ అంబాసిడర్లు, స్పాన్సర్లు, ఫేమ్, క్రేజ్.. అదనం. అయినా ఐపీఎల్‌ ఆడినట్టుగా టీమిండియాకి ఎందుకు ఆడలేకపోతున్నాడనేది అభిమానుల అనుమానం...

99
Image credit: Getty

Image credit: Getty

ఇంతకుముందు సురేష్ రైనా కూడా ఇదే విధంగా ఆడేవాడు. ఐపీఎల్‌లో అదరగొడుతూ టీమిండియా మ్యాచుల్లో ఫ్లాప్ అయ్యేవాడు. ఫలితంగా టీమ్‌లో చోటు కోల్పోయి, కొన్నాళ్ల తర్వాత ‘మిస్టర్ ఐపీఎల్’ ట్యాగ్‌తో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్ ఈ విషయాన్ని త్వరగా గుర్తిస్తే బాగుంటుందని, తన కెరీర్ కూడా బాగుపడుతుందని హితవు చేస్తున్నారు అభిమానులు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved