KL Rahul: ఆ లోటు కనిపించింది.. రోహిత్, విరాట్ పై కేఎల్ రాహుల్ కామెంట్స్
KL Rahul: ఇంగ్లాండ్ పై ఓవల్‌లో భారత్ విక్టరీ కొట్టి సిరీస్ ను సమం చేసింది. కేఎల్ రాహుల్ విజయం పై స్పందిస్తూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఇంగ్లాండ్ పై భారత్ గెలుపుతో టెస్టు సిరీస్ సమం.. కేఎల్ రాహుల్ భావోద్వేగం
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓవల్ వేదికగా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఓవల్‌లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పాటు టెస్ట్ క్రికెట్‌పై టీమ్ ఫైటింగ్ స్పిరిట్ ను మరోసారి ప్రపంచానికి చూపించింది భారత్.
Historic win! 🇮🇳
Belief and character shown by the team was brilliant to see! Fitting end to what has been an incredible series.
Nothing quite like Test Cricket! ❤️#ENGvsINDpic.twitter.com/Ma6lVXWHlL— Cheteshwar Pujara (@cheteshwar1) August 4, 2025
KNOW
కేఎల్ రాహుల్ అసాధారణ ప్రదర్శన
భారత్-ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ లో అతను మొత్తం 532 పరుగులు చేశాడు. 53.20 సగటుతో అతని బ్యాటింగ్ కొనసాగింది.
ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో స్థిరతను చూపిస్తూ కేఎల్ రాహుల్, భారత టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. తన ఫామ్‌తో పాటు జట్టును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అవసరమైన సమయంలో జట్టుకు పరుగులు అందించాడు.
KL Rahul Shines!
2nd-Highest Runs by an Indian Opener in a SENA Test Series 💥#INDvsENG#bcci#KLRahul#cricketnews#cricketupdate#andersontendulkartrophypic.twitter.com/Ps1uLWp73I— CricInformer (@CricInformer) August 2, 2025
టెస్ట్ క్రికెట్‌కు ఇది కొత్త ఆరంభం: కేఎల్ రాహుల్
ఓవల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “ఈ విజయం అన్నింటినీ అందించింది. నేను క్రికెట్‌లో ఎన్నో విజయాలు చూశాను.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, వరల్డ్ కప్ గెలిచాం. కానీ ఈ విజయం ప్రత్యేకమైనది. టెస్ట్ క్రికెట్ ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ మేము మా ఆటతీరు ద్వారా అందరికీ సమాధానం చెప్పాము. మాకు అవకాశం ఇవ్వలేదు కానీ ప్రతీ మ్యాచ్‌లో పోరాడి చివరకు 2-2తో సిరీస్ ను సమం చేశాం. ఇది డ్రా అయినా సరే, ఇది భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త ఆరంభం” అని అన్నాడు.
రోహిత్-విరాట్ లేని లోటు కనిపించింది : కేఎల్ రాహుల్
భారత జట్టు సీనియర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా కేఎల్ రాహుల్ గుర్తు చేశారు. జట్టులో వారులేని లోటు కనిపించిందని అన్నారు. “రోహిత్, విరాట్, అశ్విన్ లేనప్పుడు మొదటి రెండు వారాలు చాలా విచిత్రంగా అనిపించాయి” అని కేఎల్ రాహుల్ అన్నారు.
“ఆ సమయంలో ప్రతీ ఆటగాడు నా దగ్గరకు వచ్చి ఇంగ్లాండ్ పరిస్థితుల గురించి అడిగేవారు. నేను వేరే పాత్రలోకి వచ్చానని అప్పుడు నాకు అనిపించింది. గిల్ అద్భుతంగా ముందుండి నాయకత్వం వహించాడు. అతను జట్టుతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అతను మంచి టెస్ట్ కెప్టెన్ అవుతాడు” అని కేఎల్ రాహుల్ ప్రశంసించాడు.
KL Rahul – a complete team man and the leader of this Indian side. Without you, it wouldn’t have been possible 🤍pic.twitter.com/RamBWWdnoE
— SKY𝕏 (@skyxaura) August 4, 2025
భారత జట్టు అద్భుతమైన కమ్ బ్యాక్
ఈ సిరీస్ లీడ్స్ టెస్టు తో ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. అయితే, బర్మింగ్‌హామ్‌లో తిరిగి ఫామ్‌కి వచ్చింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించి ఆ స్టేడియంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. తర్వాత లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. చివరికి ఓవల్‌లో కీలక మ్యాచ్‌ను గెలిచి భారత్ సిరీస్‌ను సమం చేసింది.
ఈ విజయం భారత టెస్ట్ జట్టుకు కొత్త శక్తిని నింపిందని చెప్పాలి. యంగ్ కెప్టెన్ గిల్ నాయకత్వంలో భారత టెస్ట్ బృందం మరిన్ని విజయాలు సాధించగలదన్న నమ్మకాన్ని కేఎల్ రాహుల్ తన వ్యాఖ్యలతో తెలిపారు.
𝙈.𝙊.𝙊.𝘿 𝙊𝙫𝙖𝙡 🥳#TeamIndia | #ENGvINDpic.twitter.com/kdODjFeiwE
— BCCI (@BCCI) August 4, 2025