MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Siraj: ఇంగ్లాండ్‌పై సిరాజ్ మ్యాజిక్.. ఓవల్‌లో హైదరాబాదీ బ్రాండ్

Siraj: ఇంగ్లాండ్‌పై సిరాజ్ మ్యాజిక్.. ఓవల్‌లో హైదరాబాదీ బ్రాండ్

Siraj: ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంలో హైద‌రాబాద్ స్టార్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టాడు. ఓవల్ టెస్టులో 5 వికెట్లు తీసి భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 04 2025, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సిరాజ్ దెబ్బ‌కు ఇంగ్లాండ్ ఆలౌట్
Image Credit : Getty

సిరాజ్ దెబ్బ‌కు ఇంగ్లాండ్ ఆలౌట్

భార‌త్-ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ లో భాగంగా చివ‌రి టెస్టు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగింది. ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై కేవలం 6 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 

ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మ‌న హైద‌రాబాదీ సిరాజ్ మియా.. సూప‌ర్ స్టార్ మహమ్మద్ సిరాజ్. క్యాచ్ వదిలిన ఒత్తిడిలోనూ అద్భుత‌మైన క‌మ్ బ్యాక్ తో తిరిగి వ‌చ్చి 5 వికెట్ల‌తో ఇంగ్లాండ్ ను చిత్తు చేశాడు. భార‌త్ కు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

Test cricket… absolute goosebumps.
Series 2–2, Performance 10/10!

SUPERMEN from INDIA! What a Win. 💙🇮🇳🏏 pic.twitter.com/ORm1EVcbRH

— Sachin Tendulkar (@sachin_rt) August 4, 2025

DID YOU
KNOW
?
ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లలో అత్యధిక వికెట్లు తీసిన సిరాజ్
ఇంగ్లాండ్ లో ఆ జట్టుతో భారత్ ఆడిన ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా బుమ్రాను సిరాజ్ సమం చేశాడు. బుమ్రా, సిరాజ్ లు 23 వికెట్లు తీసుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇంగ్లాండ్ నుంచి మ్యాచ్ ను లాగేసిన సిరాజ్
Image Credit : Getty

ఇంగ్లాండ్ నుంచి మ్యాచ్ ను లాగేసిన సిరాజ్

టెస్టు చివరి రోజు ఉదయం ఇంగ్లాండ్‌కు విజయం కోసం కేవలం 35 పరుగులే అవసరం. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. దాదాపు ఇంగ్లాండ్ గెలుపు ప‌క్కా అనే అంచ‌నాలున్నాయి. కానీ, అంచ‌నాల‌ను యంగ్ ఇండియా త‌ల‌కిందులు చేసింది. ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ అద్బుత విజ‌యం సాధించ‌డంలో సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క‌ వికెట్లు తీసుకున్నాడు.

త‌న‌ రెండో కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన సిరాజ్ గస్ అట్కిన్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ వేసిన బంతి వేగంగా దూసుకు వ‌చ్చి స్టంప్‌ను కొట్టింది.. దెబ్బ‌కు మిడిల్ స్టంప్ ఎగిరిప‌డింది. ఈ వికెట్‌తో మ్యాచ్ మళ్లీ భారత్ చేతుల్లోకి వచ్చింది. చివరికి ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ మ్యాచ్‌లో 104 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకున్నాడు.

It's all over at the Oval 🤩

FIFER for Mohd. Siraj 🔥🔥

Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE

#TeamIndia | #ENGvIND pic.twitter.com/ffnoILtyiM

— BCCI (@BCCI) August 4, 2025

36
ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ను దెబ్బ‌కొట్టిన సిరాజ్
Image Credit : Getty

ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ను దెబ్బ‌కొట్టిన సిరాజ్

సిరాజ్ కేవ‌లం చివ‌రి రోజు మాత్ర‌మే త‌న హీరోయిజాన్ని చూపించ‌లేదు. అత‌ని బౌలింగ్ సామ‌ర్థ్యం కేవ‌లం ఈ ఒక్క రోజుకే ప‌రిమితం కాలేదు. రెండో రోజే సిరాజ్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. భారత్ 270 పరుగులకు ఆలౌటైన తర్వాత ఇంగ్లాండ్ 109/1 వద్ద ఆట‌ను కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో సిరాజ్ దూకుడు చూపించాడు.

మొద‌ట ఒలీ పోప్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత జో రూట్‌ను పెవిలియ‌న్ కు పంపాడు. డెబ్యూటెంట్ జేకబ్ బెథెల్‌ను కూడా ఎల్బీడ‌బ్ల్యూగా అవుట్ చేశాడు. చివరగా హ్యారీ బ్రూక్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 109/1 నుంచి 247 పరుగులకు కుప్పకూలింది. ఆ స్పెల్‌లో సిరాజ్ 4 వికెట్లు తీసి 86 పరుగులు ఇచ్చాడు. ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

46
మూడో రోజు కీల‌క వికెట్ తో మ్యాచ్ ను ఉత్కంఠ‌గా మార్చిన సిరాజ్
Image Credit : Getty

మూడో రోజు కీల‌క వికెట్ తో మ్యాచ్ ను ఉత్కంఠ‌గా మార్చిన సిరాజ్

భారత్ చివరి ఇన్నింగ్స్‌లో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. మూడో రోజు ఆఖరి ఓవర్‌లో సిరాజ్ అద్భుత‌మైన యార్కర్‌తో జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది ఆ టెస్టులో అత్యంత కీలకమైన బంతిగా నిలిచింది. మ్యాచ్ ఫ్లోను భారత్ వైపు మళ్లించింది.

56
ఈ సిరీస్ లో 185 ఓవ‌ర్లు బౌలింగ్ వేసిన సిరాజ్
Image Credit : Getty

ఈ సిరీస్ లో 185 ఓవ‌ర్లు బౌలింగ్ వేసిన సిరాజ్

ఈ ఐదు వికెట్ల ఘనత కేవలం గణాంకాల కోసం కాదు. బుమ్రా లేని సమయంలో భార‌త జ‌ట్టును అద్భుత‌మైన బౌలింగ్ తో నిల‌బెట్టిన గర్వించదగ్గ క్ష‌ణాలు. విశ్రాంతి లేకుండా మొత్తం ఐదు టెస్టు ల‌లో ఆడాడు. ఏకంగా 185 ఓవ‌ర్లు బౌలింగ్ వేశాడు. త‌క్కువ ప‌రుగులు ఇస్తూ 23 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వ‌ర్క్ లోడ్ ఉన్న‌ప్ప‌టికీ అద్భుత‌మైన బౌలింగ్ తో సిరాజ్ తన నైపుణ్యం, నిబద్ధతను ప్ర‌ద‌ర్శించాడు.

ఈ మ్యాచ్‌లో సిరాజ్ఆ 200 అంతర్జాతీయ వికెట్ల మార్కును కూడా దాటాడు. టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున ఇంగ్లాండ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇది అతని సామర్థ్యానికి అద్దం పట్టే సందర్భంగా చెప్ప‌వ‌చ్చు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు సిరాజ్ తీసుకున్నాడు. 

66
భార‌త జ‌ట్టు విజ‌యంలో సిరాజ్ ముద్ర
Image Credit : ANI

భార‌త జ‌ట్టు విజ‌యంలో సిరాజ్ ముద్ర

ఈ మ్యాచ్ విజయంలో ఇతర ప్లేయ‌ర్ల సహకారం ఉన్నప్పటికీ, ఈ గెలుపు సిరాజ్ సూప‌ర్ బౌలింగ్ తోనే సాధ్య‌మైందంటే ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే రెండో రోజు బ్రేక్‌త్రూ లేకపోతే ఇంగ్లాండ్ లీడ్ తీసుకునేది. మూడో రోజు క్రాలీ వికెట్ లేకపోతే సులభంగా మ్యాచ్ జారిపోయేదే. ఐదో రోజు ఆఖరి స్పెల్ లేకపోతే భారత్ ఓటమిని చవిచూసేది. ఈ సంద‌ర్భాల‌న్నింటినీ సిరాజ్ మార్చేశాడు.

ఈ మ్యాచ్ త‌ర్వాత సిరాజ్ “ఇది జట్టు కోసం. నా గుండెతో బౌలింగ్ చేశా” అని అన్నాడు. కానీ ఈ విజయం సాధారణ ప్రదర్శన కాదు, అగ్నిపరీక్షగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో సిరాజ్ విజ‌యం సాధించాడు. భార‌త్ కు అద్భుత విజ‌యం అందించాడు.

హైదరాబాద్ వీధుల్లో ప్రారంభమైన సిరాజ్ ప్రయాణం, లండన్ ఓవల్‌లో ఉన్నత శిఖరాలకు చేరింది. ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. క్రికెట్ ప్రపంచం ముందు ఇప్పుడు సిరాజ్ఆ ఒక నిజమైన హీరోగా నిలిచాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
Asia Cup 2025 Team India: ఆసియా క‌ప్ 2025లో భార‌త జ‌ట్టులో ఉండే 15 మంది ప్లేయ‌ర్లు ఎవ‌రు?
Recommended image2
IND vs ENG: వాటే టెస్టు మ్యాచ్.. ఓవల్ లో ఇంగ్లాండ్ పై అద్భుత విజయం.. భారత్ కొత్త చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved