కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటే చాలు... విరాట్ కోహ్లీ నుంచి సూర్యకుమార్ యాదవ్ దాకా...
టీమిండియా కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లో ఘోర పరాజయాలను అందుకున్నాడు కెఎల్ రాహుల్. అయితే ఆ తర్వాత వరుసగా 8 మ్యాచుల్లో విజయాలు అందుకుని, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో నిలిచాడు రాహుల్...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లేకుండా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది భారత జట్టు. మొదటి రెండు వన్డేల్లో భారత జట్టు, ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కుదురుకోవడం, వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది..
Image credit: Getty
కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇలాంటి కమ్‌బ్యాక్స్ చాలా కామన్‌గా మారాయి. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు..
Cheteshwar Pujara
దాదాపు నాలుగేళ్లుగా సెంచరీ చేయలేక, టీమ్‌లో చోటు కూడా కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా... రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడాడు. ఈ సిరీస్‌లో పూజారా టెస్టు సెంచరీ చేయడమే కాకుండా, కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు...
శిఖర్ ధావన్ కెప్టెన్సీలో కెరీర్ మొదలెట్టిన శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా సెటిల్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ మొట్టమొదటి వన్డే సెంచరీ, మొట్టమొదటి టెస్టు సెంచరీ రెండూ కూడా కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే వచ్చాయి...
టీమ్‌లోకి వస్తూ పోతూ ఉన్న ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు. అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా, అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్..
కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సెంచూరియన్‌లో జరిగిన టెస్టులో శార్దూల్ ఠాకూర్ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 61 పరుగులకే 7 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, సౌతాఫ్రికాపై బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు...
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, స్వదేశంలో ఆసీస్‌పై 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు భారత బౌలర్లు ఆసీస్‌పై 5 వికెట్లు తీసినా, వారంతా స్పిన్నర్లే...
కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో 27 ఏళ్ల తర్వాత మొహాలీలో ఆస్ట్రేలియాపై వన్డే గెలిచింది భారత జట్టు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో 1996లో ఆసీస్‌పై వన్డే గెలిచింది భారత జట్టు. ఆ తర్వాత గంగూలీ, ద్రావిడ్, కోహ్లీ, రోహిత్, ధోనీ... ఇలా ఎంత మంది కెప్టెన్లు మారినా మొహాలీలో ఆసీస్‌పై వన్డే గెలవలేకపోయింది.
ఇండోర్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్‌పై వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో కమ్‌బ్యాక్‌ని ఘనంగా చాటుకున్నాడు..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే ఆరంగ్రేటం చేసి 2 హాఫ్ సెంచరీలు బాదిన సూర్య, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మార్చి 2023లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్య...
Suryakumar Yadav
అలాంటి సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో అదే ఆస్ట్రేలియాపై వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది... అదిరిపోయే కమ్‌బ్యాక్ చాటుకున్నాడు.
Image credit: Getty
కెప్టెన్సీ స్కిల్స్ లేవని, కెప్టెన్‌గా పనికి రాడని ట్రోల్స్ ఎదుర్కొన్న కెఎల్ రాహుల్, ప్లేయర్ల కమ్‌బ్యాక్‌కి మాత్రం చక్కగా ఉపయోగపడుతున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో హార్ధిక్ పాండ్యా, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా ఫిక్స్ అయిపోయాడు. దీంతో కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ దక్కొచ్చు..