MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కెఎల్ రాహుల్ ఇంట పెళ్లి సందడి... ముఖ్య అతిథులుగా కోహ్లీ, ధోనీ, రోహిత్...

కెఎల్ రాహుల్ ఇంట పెళ్లి సందడి... ముఖ్య అతిథులుగా కోహ్లీ, ధోనీ, రోహిత్...

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి కోసం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్న లోకేశ్ రాహుల్, జనవరి 23న సోమవారం బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకోబోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 21 2023, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit: Varinder Chawla (L); KL Rahul Instagram (R)

Image Credit: Varinder Chawla (L); KL Rahul Instagram (R)

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఖండలా బంగ్లాలో కెఎల్ రాహుల్, అథియా శెట్టిల వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకా చకా జరిగిపోతున్నాయి...
 

27

జనవరి 22న మెహెందీ కార్యక్రమం నిర్వహించి, అదే రోజు సాయంత్రం సంగీత్ ప్రోగ్రామ్ ఉంటుందని సమాచారం. జనవరి 23న కేవలం 100 మంది ఆత్మీయ బంధుమిత్రుల మధ్య పెళ్లి జరగబోతోంది...
 

37
Athiya Shetty, KL Rahul

Athiya Shetty, KL Rahul

కెఎల్ రాహుల్ పెళ్లికి హాజరయ్యే వాళ్లు కూడా ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదు. మొబైల్ ఫోన్లలో ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఇరు కుటుంబాలు..

47
kl rahul and athiya shetty

kl rahul and athiya shetty

ఈ వివాహ వేడుకకి బాలీవుడ్ ప్రముఖులు షారుక్, అమీర్, హృతిక్ రోషన్, అమితాబ్, అక్షయ్‌తో పాటు భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కుటుంబసమేతంగా హాజరు కాబోతున్నారని సమాచారం...
 

57

పెళ్లైన రెండు నెలలకు ముంబైలో భారీగా రిసెప్షన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది సునీల్ శెట్టి కుటుంబం. ‘బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా పెళ్లిని అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య నిర్వహించాలని అనుకుంటున్నాం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ, క్రికెట్ ప్రముఖుల కోసం ఐపీఎల్ ముగిసిన తర్వాత మే నెలలో భారీగా వెడ్డింగ్ బాష్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం.. మీడియాకి ఈ వివాహానికి అనుమతి ఉండదు...’ అంటూ సునీల్ శెట్టి దగ్గరి బంధువు, మీడియాకి తెలియచేశారు...

67

కెఎల్ రాహుల్‌, హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ఢేటింగ్‌లో ఉన్నాడని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే రాహుల్ తనకి కేవలం స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది నిధి అగర్వాల్. చాలా రోజులుగా అథియా శెట్టితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు కెఎల్ రాహుల్...

77

2021 నవంబర్‌లో అథియా శెట్టి పుట్టినరోజు విషెస్ చెబుతూ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు కెఎల్ రాహుల్. పెళ్లికి ముందే క్రికెటర్‌తో కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన అథియా శెట్టి, కెఎల్ రాహుల్ సర్జరీ కోసం జర్మనీ వెళ్లినప్పుడు కూడా తోడుగా వెళ్లింది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: ఐర్లాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా శాంసన్, ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే
Recommended image2
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
Recommended image3
IPL : కోచ్‌గా గంభీర్ సక్సెస్.. కానీ ఐపీఎల్‌లో మాత్రం నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved