- Home
- Sports
- Cricket
- ఖరీదైన కారు కొన్న కేకేఆర్ కెప్టెన్.. బుల్లెట్ కంటే వేగంగా వెళ్లడంలో నెంబర్ వన్.. ఎంత దూరమైనా నిమిషాల్లోనే..
ఖరీదైన కారు కొన్న కేకేఆర్ కెప్టెన్.. బుల్లెట్ కంటే వేగంగా వెళ్లడంలో నెంబర్ వన్.. ఎంత దూరమైనా నిమిషాల్లోనే..
Shreyas Iyer: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు సారథి గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఈ కారు వేగానికి బుల్లెట్ రైలు కూడా పనిచేయదు.

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఐపీఎల్ లో కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెస్ కు చెందిన అత్యంత లగ్జరీ కార్ గా గుర్తింపు పొందిన ‘మెర్సిడెస్-ఏంఎంజీ జీ 63 మోడల్ ను అయ్యర్ కొన్నాడు.
ముంబైలోని ల్యాండ్ మార్క్ కార్స్ షో రూంలో అయ్యర్ ఈ కారును రూ. 2.45 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు జీ వాగన్ సిరీస్ లో ఇది టాప్ మోడల్ కారు గా గుర్తింపు దక్కించుకుంది.
ఈ కారు 4.5 సెకన్ల వ్యవధిలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. అయ్యర కారుకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయ్యర్ కొనుగోలు చేసిన ఈ కారు ఫోటోతో అతడి ఫోటోను జతపరుచుతూ ల్యాండ్ మార్క్ కార్స్ షో రూం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘మెర్సెడెస్ బెంజ్ లోని జీ 63 కొన్నందుకు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు కంగ్రాట్యులేషన్స్. విలక్షణమైన, కలకాలం మన్నే డిజైన్ ఈ కార్ సొంతం.
మేము మిమ్మల్ని స్టార్ ఫ్యామిలీకి స్వాగతిస్తున్నాము. మీ కవర్ డ్రైవ్ లను చూసి మేము ఎంతగానో ఆనందించాం. ఇక మీరు మా కార్ డ్రైవింగ్ ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం..’ అని రాసుకొచ్చింది.
ఐపీఎల్-15లో శ్రేయస్ కేకేఆర్ కు కెప్టెన్ గా వ్యవహరించినా ఆ జట్టును విజయవంతంగా నడిపించలేకపోయాడు. వరుస పరాజయాలతో ఆ జట్టు ప్లేఆఫ్స్ కు కూడా వెళ్లలేకపోయింది. ఇక బ్యాటర్ గా అయ్యర్.. 14 మ్యాచులలో 401 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి.
ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో అయ్యర్ ఇక టీమిండియా తరఫున పోటీ పడనున్నాడు. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కాబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో అతడు భారత జట్టు కు కీలకంగా వ్యవహరించనున్నాడు.
కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ లు ఈ సిరీస్ కు అందుబాటులో లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ భారం అతడి మీద పడనుంది.