కింగ్స్ ఎలెవన్ పర్సులో రూ. 53.20 కోట్లు... ఈసారి వేలంలో ఎవరి దగ్గర ఎంత మిగిలి ఉందంటే...

First Published Jan 21, 2021, 10:13 AM IST

కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లేయర్లలో చాలామందిని 2021 ఐపీఎల్ మినీ వేలానికి విడుదల చేసేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మిగిలిన జట్లతో పోలిస్తే... ఈ రిలీజ్ కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్సులో భారీగా డబ్బు వచ్చి చేరింది. 2021 ఐపీఎల్ వేలానికి ముందు ఏయే ఫ్రాంఛైజీ పర్సులో ఎంతెంత డబ్బు ఉందో తెలుసా... రూ.53.20 కోట్ల రూపాయలతో పంజాబ్ పర్సు భారీగా బరువు ఉండగా...2020 రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో కేవలం 9 కోట్లు మాత్రమే ఉన్నాయి.