- Home
- Sports
- Cricket
- ఆ ఇద్దరినీ వెంటనే బయటికి పంపించండి... బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలలు...
ఆ ఇద్దరినీ వెంటనే బయటికి పంపించండి... బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలలు...
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెను దుమారమే రేపుతోంది. బీసీసీఐ తీరును తీవ్రంగా నిరసిస్తూ, సోషల్ మీడియాలో ‘Shame on BCCI’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసిన అభిమానులు, ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు నుంచి జై షా, గంగూలీలను బయటికి పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే కెప్టెన్‌గా 2023 ప్రపంచ కప్ వరకూ కొనసాగాలని విరాట్ కోహ్లీ భావించడం, అయితే బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది...
వన్డేల్లో అత్యధిక శాతం విజయాలు, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్న విరాట్ కోహ్లీని ఏ కారణంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...
గత సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టుకు మొట్టమొదటి వన్డే సిరీస్ విజయాన్ని అందించాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా ఆరు మ్యాచుల్లో 558 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు...
స్వదేశంలో వరుసగా 17 మ్యాచులు గెలిచి, పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికాను 5-1 తేడాతో ఓడించిన విరాట్ కోహ్లీని సఫారీ సిరీస్‌కి ముందు వన్డే కెప్టెన్‌గా తొలగించడంపై తీవ్ర వ్యతిరేకత రేగుతోంది...
విరాట్ కోహ్లీకి వస్తున్న క్రేజ్ చూసి తట్టుకోలేక భారత క్రికెట్ బోర్డు, స్వార్థ రాజకీయాలతో అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిందని... బీసీసీఐలో రాజకీయ నాయకులకు, నాయకుల పుత్రులకు స్థానం ఇవ్వడం ఎందుకుని ప్రశ్నిస్తున్నారు...
ట్విట్టర్‌లో ‘కిక్ అవుట్ షా గంగూలీ’ (#KickOutShahGanguly) హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న కోహ్లీ అభిమానులు, విరాట్‌కి మళ్లీ వన్డే కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు పదవీకాలం ముగిసిన బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ భారత క్రికెట్ బోర్డు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారిని తొలగిస్తేనే భారత క్రికెట‌్‌కి మంచి రోజులు వస్తాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు...
కొన్ని ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ కంటే నువ్వే బెస్ట్ కెప్టెన్‌వి, ఎందుకంటే నువ్వు ఐపీఎల్ టైటిల్ గెలిచావు... అంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కి రోహిత్ శర్మ, ‘థ్యాంక్స్...’ అంటూ రిప్లై ఇచ్చాడు...
విరాట్ కోహ్లీపై రోహిత్ శర్మ ఎన్నేళ్లుగా విద్వేషాన్ని, ఈర్ష్యాన్ని మనసులో దాచుకున్నాడనేదానికి ఈ సంఘటనే నిదర్శనమంటూ ఏడేళ్ల క్రితం నాటి ట్వీట్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు...