ఈ వార్మప్ మ్యాచ్ ఆడే టీమ్స్ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్ జరగనుందా.. కేవిన్ పీటర్సన్ జోస్యం..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్స్‌లో భారత్, ఇంగ్లాండ్ కూడా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్...
Ben Stokes
గత వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్, ఈ ప్రపంచ కప్ కోసం వన్డే రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకున్నాడు. బెన్ స్టోక్స్ రీఎంట్రీతో ఇంగ్లాండ్ బలం మరింత పెరిగింది..
డేవిడ మలాన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, మొయిన్ ఆలీ, అదిల్ రషీద్ వంటి సీనియర్లతో పాటు హారీ బ్రూక్, సామ్ కుర్రాన్ వంటి కుర్రాళ్లతో నిండిన ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టీమ్... 2019 వన్డే వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో ఆరంభ మ్యాచ్ ఆడుతోంది.
ఆ తర్వాత అక్టోబర్ 10న బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 15న ఆఫ్ఘాన్‌తో, అక్టోబర్ 21న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 26న శ్రీలంకతో, అక్టోబర్ 29న భారత్‌తో మ్యాచులు ఆడుతుంది. లక్నోలో ఇండియా - ఇంగ్లాండ్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది..
సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్‌తో గౌహతిలో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది భారత్. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యం కానుంది. పరిస్థితి చూస్తుంటే, ఈ మ్యాచ్ ప్రారంభమైనా, రిజల్ట్ రావడం కష్టమే. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు..
‘ఈ రోజు వార్మప్ మ్యాచ్ ఆడబోతున్న ఇండియా, ఇంగ్లాండ్.. ఈసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతున్నాయా?’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్.. ఈ ట్వీట్‌కి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటిదాకా ఇంగ్లాండ్, ఇండియా జట్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇప్పటివరకూ తలబడలేదు. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 5 పరుగుల తేడాతో గెలిచింది భారత జట్టు..
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పోలిస్తే, ఇంగ్లాండ్ ఫైనల్ చేరితే టీమిండియాకి కాస్త ఈజీ కావచ్చని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. అయితే అది జరగాలంటే టీమిండియా ఫైనల్ దాకా రావాలి కదా అనే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది..