MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Salman Nizar : ఒకే ఓవర్ లో 40 పరుగులు.. 12 బంతుల్లో 11 సిక్సర్లు.. సునామీని మించిన బ్యాటింగ్ !

Salman Nizar : ఒకే ఓవర్ లో 40 పరుగులు.. 12 బంతుల్లో 11 సిక్సర్లు.. సునామీని మించిన బ్యాటింగ్ !

Salman Nizar: 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. అదే తరహాలో ఇప్పుడు ఏకంగా 12 బంతుల్లో 11 సిక్సర్లు బాది కేరళ ప్లేయర్ సల్మాన్ నిజార్ పరుగుల సునామీ రేపాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 31 2025, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
12 బంతుల్లో 11 సిక్సర్లు బాదిన సల్మాన్ నిజార్
Image Credit : Asianet News

12 బంతుల్లో 11 సిక్సర్లు బాదిన సల్మాన్ నిజార్

12 బంతుల్లో 11 సిక్సర్లు! ఇది నమ్మశక్యం కాదని అనిపించవచ్చు, కానీ నిజంగానే ఇది జరిగింది. ఇది ఏదో చిన్నపాటి మ్యాచ్‌లో కాదు, కేరళ క్రికెట్ లీగ్‌లో జరిగింది. కాలికట్ గ్లోబ్‌స్టర్స్, ఆదానీ త్రివేండ్రం రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.

యంగ్ ప్లేయర్ సల్మాన్ నిజార్ కేవలం 26 బంతుల్లో 86 పరుగులు సాధించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో కాలికట్ జట్టు 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. తిరువనంతపురంలో సల్మాన్ ఈ రికార్డును నెలకొల్పాడు.

DID YOU
KNOW
?
ఒకే ఓవర్ లో 6 సిక్సర్ల రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. 2007 వరల్డ్ కప్‌లో హెర్షెల్ గిబ్స్ (నెదర్లాండ్స్‌పై), 2007 T20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ (ఇంగ్లాండ్‌పై), 2021లో కీరన్ పొలార్డ్ (శ్రీలంకపై) సిక్సర్ల మోత మోగించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన సల్మాన్
Image Credit : Asianet News

తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన సల్మాన్

ఆదానీ త్రివేండ్రం రాయల్స్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగిన కాలికట్ గ్లోబ్‌స్టర్స్ తీవ్ర ఒత్తిడిలో పడింది. 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత సల్మాన్ నిజార్ తన బ్యాటింగ్ విధ్వంసం మొదలుపెట్టాడు.

19వ ఓవర్ వేయడానికి వచ్చిన ఐపీఎల్ ఆటగాడు బాసిల్ థంపిని కూడా సల్మాన్ వదల్లేదు. ఆ ఓవర్‌లో మొదటి ఐదు బంతులకు సల్మాన్ వరుసగా సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్‌లో తానే స్ట్రైక్ తీసుకోవాలనే ఉద్దేశంతో చివరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో బాసిల్ థంపి ఊపిరి పీల్చుకున్నాడని చెప్పవచ్చు.

36
ఒకే ఓవర్ లో 40 పరుగులు కొట్టిన సల్మాన్ నిజార్
Image Credit : our own

ఒకే ఓవర్ లో 40 పరుగులు కొట్టిన సల్మాన్ నిజార్

సల్మాన్ నిజార్ ఒకే ఓవర్‌లో 40 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఆదానీ త్రివేండ్రం రాయల్స్ తరపున చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అభిజిత్ ప్రవీణ్‌పై సల్మాన్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో ఒక వైడ్ బాల్ కారణంగా మరో 4 పరుగులు వచ్చాయి. దీంతో మొత్తం 40 పరుగులు నమోదయ్యాయి. చివరి రెండు ఓవర్లలో మొత్తం 71 పరుగులు వచ్చాయి. సల్మాన్ ధాటికి కాలికట్ గ్లోబ్‌స్టర్స్ భారీ స్కోరు చేసింది. సల్మాన్ ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆ జట్టు స్కోరు 130 కూడా దాటేది కాదు.

46
యువరాజ్ రికార్డును సమం చేసిన సల్మాన్ నిజార్
Image Credit : our own

యువరాజ్ రికార్డును సమం చేసిన సల్మాన్ నిజార్

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ రికార్డును సల్మాన్ నిజార్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో భారత జట్టు తరపున ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు యువరాజ్ సింగ్‌కు ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ ఈ రికార్డు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రవిశాస్త్రి నిలిచాడు.

దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హెర్షెల్ గిబ్స్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌లకు కూడా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సల్మాన్ నిజార్ కూడా అందుకున్నాడు.

56
రంజీల్లోనూ అదరగొట్టిన సల్మాన్
Image Credit : our own

రంజీల్లోనూ అదరగొట్టిన సల్మాన్

దేశవాళీ క్రికెట్‌లో కూడా సల్మాన్ నిజార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. గత సీజన్‌ రంజీ ట్రోఫీలోని పలు మ్యాచ్‌లలో మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కేరళ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ చేరుకోవడంతో కీలక పాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై జట్టుపై 49 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత సీజన్‌లో కేరళ క్రికెట్ లీగ్‌లో 455 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ లీగ్‌లో కొత్త రికార్డు సృష్టించాడు.

66
టీ20 ఫార్మాట్‌కు సరిపోయే ప్లేయర్ సల్మాన్
Image Credit : our own

టీ20 ఫార్మాట్‌కు సరిపోయే ప్లేయర్ సల్మాన్

గత సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దులీప్ ట్రోఫీలో దక్షిణ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాతీయ సెలెక్టర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
కోహ్లీ, రోహిత్, పుజారా లకు సచిన్‌ లాంటి అదృష్టం లేదు !
Recommended image2
ఆసియా కప్ 2025: చైనాలో అడుగుపెట్టిన భారత మహిళల హాకీ జట్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved