- Home
- Sports
- Cricket
- బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా... ఐదో టెస్టులో అశ్విన్‌ని పక్కనబెట్టడంపై...
బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా... ఐదో టెస్టులో అశ్విన్‌ని పక్కనబెట్టడంపై...
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వకపోవడం తీవ్ర వివాదాస్పమవుతోంది. కీలక సమయాల్లో వికెట్ తీయడమే కాకుండా బ్యాటుతోనూ పరుగులు చేయగల సత్తా ఉన్న అశ్విన్‌ని ఎందుకు పక్కనబెట్టారనేది సమాధానం తెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది...

Image credit: Getty
2021 ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడించలేదు టీమిండియా. అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి... నలుగురు పేసర్లతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు కల్పించారు...
అయితే శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ అదరగొట్టడంతో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో నెగ్గి, ఓ మ్యాచ్‌లో ఓడింది భారత జట్టు. ఏడాది తర్వాత ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ ఇదే ఫార్ములాని వాడింది టీమిండియా...
రోహిత్ శర్మ కరోనా బారిన పడి ఐదో టెస్టులో బరిలో దిగకపోవడంతో ఈ నిర్ణయాత్మక టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అయినా తుదిజట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కలేదు..
‘ఇప్పటికీ చాలామందికి జస్ప్రిత్ బుమ్రాని కెప్టెన్‌గా ఎందుకు నియమించారో అర్థం కావడం లేదు. బుమ్రాకి ఉన్న సత్తాని దృష్టిలో పెట్టుకుంటే కెప్టెన్‌గా అతను సరైన వాడే. కొన్నిసార్లు అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలే, టీమ్‌కి మంచి చేస్తాయి...
అలాగే ఓవల్ టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు చేసి, బౌలింగ్‌లో అదరగొట్టాడనే ఉద్దేశంతో శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు ఇచ్చి ఉండొచ్చు. కానీ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో ఎందుకు లేడు? ఇది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు...
Ravichandran Ashwin
అశ్విన్ లాంటి ప్లేయర్‌ని ఆడించకపోవడమంటే ఫెర్రారీ కారుని గ్యారేజీలోనే పెట్టడంతో సమానం. బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా.. ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడిన రాహుల్ ద్రావిడ్‌కి అక్కడ పిచ్‌లు ఎలా స్పందిస్తాయో తెలీదా...
నాలుగో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడానికి రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఉపయోగపడేవాడు. విదేశాల్లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడడంలో తప్పేం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సెలక్టర్ జతిన్ పరన్‌జపే...