MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కేన్ విలియంసన్ కూడా కొట్టేశాడు! కోహ్లీ టెస్టు సెంచరీ ఎప్పుడు? రెండేళ్ల క్రితం అలా..

కేన్ విలియంసన్ కూడా కొట్టేశాడు! కోహ్లీ టెస్టు సెంచరీ ఎప్పుడు? రెండేళ్ల క్రితం అలా..

ప్రస్తుత తరంలో క్రికెట్‌లో ఫ్యాబ్ 4 ప్లేయర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్... టెస్టు క్రికెట్‌లో ఈ నలుగురు అద్భుత రికార్డులు నెలకొల్పి, మిగిలిన ప్లేయర్ల కంటే స్పెషల్‌గా నిరూపించుకున్నారు. అంతేకాకుండా ఈ నలుగురు టెస్టుల్లో టాప్ టీమ్స్‌కి కెప్టెన్లుగా వ్యవహరించి, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నవాళ్లే.. ఈ నలుగురిలో జో రూట్ గత రెండేళ్లలో ఏకంగా 12 సెంచరీలు బాది, కెరీర్ బెస్ట్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 27 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kane Williamson

Kane Williamson

మిగిలిన ముగ్గురిలో స్టీవ్ స్మిత్ కూడా కాస్త లేటుగా అయినా ఫామ్‌లోకి రాగా కేన్ విలియంసన్ రెండేళ్ల తర్వాత సెంచరీ అందుకున్నాడు. అప్పుడెప్పుడో 2021 ఆరంభంలో పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన కేన్ విలియంసన్... తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 132 పరుగులు చేసి... కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీ అందుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2021 జనవరిలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలు చేసి ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండగా స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియంసన్ 24, జో రూట్ 17 సెంచరీలతో ఉన్నారు. 2023 ఫిబ్రవరి వచ్చే సరికి స్టీవ్ స్మిత్ 30 సెంచరీలతో టాప్‌లోకి వెళ్లగా జో రూట్ 29 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. 

35
Kane Williamson

Kane Williamson

కేన్ విలియంసన్ 26 సెంచరీలతో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోగా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేక 27 సెంచరీలతో మూడో స్థానానికి దిగజారాడు... కోహ్లీ ఇంకా లేటు చేస్తే టాప్ 4కి పడిపోవడం ఖాయం.. 

45
Kane Williamson

Kane Williamson

రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన కేన్ విలియంసన్ కూడా సెంచరీ కొట్టేయడంతో ఇక విరాట్ కోహ్లీ మాత్రమే ఫ్యాబ్ 4లో మూడేళ్లుగా టెస్టు సెంచరీ  చేయని ప్లేయర్‌గా మిగిలిపోయాడు. వన్డేల్లో, టీ20ల్లో సెంచరీలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోతున్నాడు...
 

55
Image credit: PTI

Image credit: PTI

ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ 74 అంతర్జాతీయ సెంచరీలతో టాప్‌లో ఉంటే జో రూట్, డేవిడ్ వార్నర్ 45 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 43 సెంచరీలతో స్టీవ్ స్మిత్ 42 సెంచరీలతో ఉన్నారు. కేన్ విలియంసన్ 39 సెంచరీలతో ఆరో స్థానంలో ఉన్నాడు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved