ఆర్యన్, సుహానా, జాన్వీలను ఆ కేకేఆర్ క్రికెటర్లతో పోల్చిన జూహ్లీ చావ్లా...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీల్లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. రెండు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్, ఈసారి భారీ అంచనాలతోనే బరిలో దిగుతోంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కేకేఆర్ వింగ్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, కూతురు సుహానా ఖాన్‌లతో పాటు మరో సహ యజమాని, బాలీవుడ్ నటి జూహ్లీ చావ్లా కూతురు జాన్వీ మెహతా... కేకేఆర్ తరుపున వేలంలో పాల్గొన్నారు...
జూహ్లీ చావ్లా కూతురు జాన్వీ మెహతా, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్‌తో కలిసి ప్లేయర్ల బిడ్డింగ్‌లో చురుగ్గా పాల్గొంది.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్, కూతురు సుహానా మాత్రం కేవలం వేలంలో రిప్రెసెంటీటివ్స్‌గా కూర్చొని, బిస్కెట్లు తినడానికి, ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించారు...
తాజాగా జూహీ చావ్లా వేలంలో పాల్గొన్న జాన్వీ మెహతా, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్‌లను కేకేఆర్ ప్లేయర్లతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది.
వెల్ కమ్ టు మా కేకేఆర్ ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, నితీశ్ రాణా... మా యంగ్ ఓనర్లు ఆర్యన్, సుహానా, జాన్వీ అంటూ పోస్టు చేసింది జూహ్లీ చావ్లా...
కేకేఆర్‌కి 2022 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న శ్రేయాస్ అయ్యర్‌ని తన కూతురు జాన్వీతో పోల్చిన జూహ్లీ చావ్లా... ఆర్యన్ ఖాన్‌ని, ఓపెనర్ నితీశ్ రాణాతో, సుహానా ఖాన్‌ని ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్‌తో పోల్చింది...
గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్‌కి అర్హత సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిన కేకేఆర్, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
కెప్టెన్‌గా కేకేఆర్‌ని ఫైనల్ చేర్చినా, బ్యాటుతో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన ఇయాన్ మోర్గాన్... ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరడం విశేషం...
ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌ని రూ.12 కోట్లకు, యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రూ.8 కోట్లకు, ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ని రూ.8 కోట్లకు, సునీల్ నరైన్‌ని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ని మెగా వేలంలో రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్...
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ని రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నితీశ్ రాణాని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. అజింకా రహానే, కరుణరత్నే, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, మహ్మద్ నబీ వంటి ప్లేయర్లతో ఐపీఎల్ 2022 సీజన్ బరిలో దిగనుంది కేకేఆర్...