- Home
- Sports
- Cricket
- CSK: ఐపీఎల్ 2026కు ముందు 10 మంది ప్లేయర్లతో చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్
CSK: ఐపీఎల్ 2026కు ముందు 10 మంది ప్లేయర్లతో చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్
Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే, 2026 ఐపీఎల్ సీజన్ కు ముందు పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది. జట్టులోకి కొత్త ప్లేయర్లను తీసుకోనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో భారీ మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఒక మాస్టర్ ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. ధోని టీమ్ సీఎస్కే జట్టులో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత.. ఆ టీమ్ జట్టులోని 10 మంది ఆటగాళ్లను విడుదల చేసే యోచనలో ఉందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నైలో కలసి కీలక చర్చల తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
KNOW
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025కి ముందు విడుదల చేసే ప్లేయర్ల అంచనా
పలు మీడియా కథనాల ప్రకారం.. రాబోయే ఐపీఎల్ 2026 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసే ప్లేయర్ల లిస్టులో స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. వారిలో రవిచంద్రన్ అశ్విన్ (రూ.9.75 కోట్లు), డెవోన్ కాన్వే (రూ.6.25 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.3.4 కోట్లు), సామ్ కరన్ (రూ.2.4 కోట్లు), గుర్జప్రీత్ సింగ్ (రూ.2.2 కోట్లు), నాథన్ ఎలిస్ (రూ.2 కోట్లు), దీపక్ హుడా (రూ.1.75 కోట్లు), జేమీ ఓవర్టన్ (రూ.1.5 కోట్లు), విజయ్ శంకర్ (రూ.1.2 కోట్లు) ఉన్నారు. భారీ అంచనాలతో వీరిని సీఎస్‌కే జట్టులోకి తీసుకున్నప్పటికీ, వారిని నుంచి పెద్ద ప్రదర్శనలు అందుకోలేకపోయింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన ఎలా ఉంది?
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన రెండు జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబైతో సమంగా ఉంది. అయితే, 18వ ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు విజయాలు మాత్రమే అందుకుంది. మిగతా 10 మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025 ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయిన తొలి జట్టు చెన్నై సూపర్ కింగ్స్.
సీఎస్కేకు అశ్విన్ ప్రత్యేక అభ్యర్థన
టీమిండియా మాజీ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా తనను వదులుకోవాలని కోరారు. గత సీజన్‌లో ఆయన 9 మ్యాచ్‌లలో 7 వికెట్లు మాత్రమే తీశారు. 5 మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యారు. 2009 నుంచి 2015 వరకు సీఎస్‌కే తరపున ఆడిన అశ్విన్, తిరిగి 9.75 కోట్ల రూపాయలకు 2025 సీజన్‌లో జట్టులో చేరాడు. అయితే, అశ్విన్ అంచనాలను అందుకోలేకపోయాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని
ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉన్న బంధం ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైనది. 2008లో మొదటిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ధోని, జట్టును ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా మార్చాడు. ఆయన నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 10 సార్లు ఫైనల్‌కి చేరగా, 5 సార్లు టైటిల్ గెలిచింది (2010, 2011, 2018, 2021, 2023).
ధోని శాంత స్వభావం, ఒత్తిడిలో మంచి నిర్ణయాలు, యంగ్ ఆటగాళ్లపై నమ్మకం, జట్టులో స్థిరత ఆయన నాయకత్వ విశిష్టతలకు నిదర్శనం. చెన్నై అభిమానులకే కాదు, క్రికెట్ అభిమానులందరికీ ధోని కెప్టెన్సీ ఒక గర్వకారణంగా నిలిచింది. 2025 సీజన్ తర్వాత ఆయన రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఉన్నప్పటికీ, అధికారికంగా ఏ ప్రకటన రాలేదు.