MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వన్డే వరల్డ్ కప్‌లో తేదీల్లో మార్పులు! చలికాలంలో మ్యాచులు చూసేందుకు వచ్చే ఫ్యాన్స్‌కి ఫ్రీగా మంచినీళ్లు...

వన్డే వరల్డ్ కప్‌లో తేదీల్లో మార్పులు! చలికాలంలో మ్యాచులు చూసేందుకు వచ్చే ఫ్యాన్స్‌కి ఫ్రీగా మంచినీళ్లు...

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వేదిక ఇవ్వనుంది టీమిండియా. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అయితే ఈ తేదీల్లో ఒకటి రెండు మార్పులు ఉంటాయని ఖరారు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 27 2023, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
India vs Pakistan

India vs Pakistan

అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు దసరా నవరాత్రి ఉత్సావాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సెక్యురిటీ కారణాలతో ఈ మ్యాచ్‌ రీషెడ్యూల్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14నే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగవచ్చని టాక్ వినబడుతోంది. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ వరల్డ్ కప్ తేదీల్లో మార్పులు ఉంటాయని మాత్రం ఖరారు చేశాడు...

36

‘వరల్డ్ కప్‌లో కొన్ని తేదీల్లో ఒకటి రెండు మార్పులు ఉంటాయి. కొన్ని దేశాలు తేదీలను మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేశాయి. దానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. త్వరలో రీషెడ్యూల్ చేసిన మ్యాచుల వివరాలు తెలియచేస్తాం..’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

46

అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మంచినీళ్లు సరాఫరా చేయబోతున్నట్టు ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా... 

56
Indian fans

Indian fans

చలికాలంలో అది కూడా సాయంత్రం చలిలో జరిగే మ్యాచులు చూసేందుకు వచ్చే క్రికెట్ ఫ్యాన్స్‌కి తాగేందుకు మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వడం బాగానే ఉంది కానీ సరైన టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తే, ఇంకా బాగుంటుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

66
Jasprit Bumrah

Jasprit Bumrah

అలాగే జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కూడా అప్‌డేట్ ఇచ్చాడు జై షా. ‘జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతను ఆడొచ్చు.. అయితే ఈ విషయంలో సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు జై షా.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved