- Home
- Sports
- Cricket
- న్యూజిలాండ్‌లో జస్ప్రిత్ బుమ్రా, డబ్ల్యూపీఎల్ పనుల్లో సంజన... పెళ్లైన రెండేళ్లకు వేర్వేరుగా...
న్యూజిలాండ్‌లో జస్ప్రిత్ బుమ్రా, డబ్ల్యూపీఎల్ పనుల్లో సంజన... పెళ్లైన రెండేళ్లకు వేర్వేరుగా...
ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా గడుపుతున్నాడు జస్ప్రిత్ బుమ్రా. 2016లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జస్ప్రిత్ బుమ్రా క్రికెట్ కెరీర్‌లో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం వెన్నెముక గాయమే. పెళ్లి అయ్యాక అటు దీపక్ చాహార్, ఇటు జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ కూడా ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నారు...

స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడాడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. వీరి పెళ్లి విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలో నుంచి బ్రేక్ తీసుకున్నాడు బుమ్రా... సడెన్‌గా బుమ్రా తప్పుకోవడంతో ఏం జరిగిందా? అని అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే పెళ్లి కోసమే బుమ్రాకి లీవ్ ఇచ్చామని బీసీసీఐ ట్రెజరీ కామెంట్ చేయడంతో అసలు విషయం తెలిసింది. జస్ప్రిత్ బుమ్రా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడని కథనాలు తెగ ప్రచారం అయ్యాయి. ఆఖరికి బుమ్రా పెళ్లాడబోయేది సంజన గణేశన్‌ని అని తేలింది...
పెళ్లికి రెండుమూడేళ్ల క్రితం ఓ ప్రైవేటు కార్యక్రమంలో జస్ప్రిత్ బుమ్రాని ఇంటర్వ్యూ చేసింది సంజన గణేశన్. అలా ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి, ప్రేమలో మునిగి, రహస్యంగా పెళ్లి చేసుకునేదాకా వెళ్లింది.. పెళ్లి తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొన్న బుమ్రా- సంజన గణేశన్... నేడు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు...
Image Credit: Sanjana Ganesan Instagram
భర్తను హత్తుకున్న రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేసిన సంజన గణేశన్, ‘నిన్ను ఇలా దగ్గరగా హత్తుకుని రెండేళ్లు...’ అంటూ కాప్షన్ ఇచ్చింది. సెప్టెంబర్ 2022లో గాయంతో క్రికెట్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, భార్యతో కలిసి పారిస్‌లో న్యూఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నాడు..
అయితే ప్రస్తుతం వెన్నెముక సర్జరీ కోసం జస్ప్రిత్ బుమ్రా, న్యూజిలాండ్‌లో ఉంటే... ఆయన సతీమణి సంజన గణేశన్ మాత్రం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023ని కవర్ చేస్తోంది. వివాహ రెండో వార్షికోత్సవాన్ని ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటోందీ జంట...
గాయంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు.కనీసం వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ సమయానికి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తోంది టీమిండియా..