- Home
- Sports
- Cricket
- రికీ పాంటింగ్‌ను అలా అవుట్ చేశా, అదే నా కెరీర్‌ను మార్చేసింది... జస్ప్రిత్ బుమ్రా...
రికీ పాంటింగ్‌ను అలా అవుట్ చేశా, అదే నా కెరీర్‌ను మార్చేసింది... జస్ప్రిత్ బుమ్రా...
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి టీమిండియాలోకి వచ్చిన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. భారత జట్టు విజయాల్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బుమ్రా, ముంబై ఇండియన్స్ విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు...

2013లో ముంబై ఇండియన్స్‌కి మొట్టమొదటి టైటిల్ అందించిన జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ 2015లోనూ అదరగొట్టి, ఆ తర్వాత ఏడాది టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు...
‘ఐపీఎల్ 2013 సీజన్ కోసం నేను, అక్షర్ పటేల్ ఆలస్యంగా ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాం. నేను మొదటి మ్యాచ్ ఆడడం లేదని చెప్పేశారు...
మేం సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడి, ఆలస్యంగా ముంబై ఇండియన్స్ క్యాంపులో కలిశాం. అప్పటికే టీమ్ బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు...
మేం కూడా రెండు రోజులు వారితో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాం. అక్కడి పిచ్ పచ్చగా ఉంటుంది. ఆ పిచ్‌పై వైట్ బాల్ అద్భుతంగా స్వింగ్ అవుతుంది...
నేను కొత్త బంతితో బౌలింగ్‌కి వచ్చి రికీ పాంటింగ్‌ని బౌల్డ్ చేశాను. భారీ ఇన్‌స్వింగర్స్‌తో ప్రతీ బ్యాటర్‌ని ఇబ్బంది పెట్టాను... అదే రోజు రికీ పాంటింగ్‌ని మూడు సార్లు బౌల్డ్ చేశా...
అంతే నా గురించి చర్చించుకోవడం మొదలెట్టారు. ఇతనిలో ఏదో స్పెషాలిటీ ఉంది, తప్పకుండా ఆడించండి.. అని క్యాంపులో మాట్లాడుకోవడం విన్నాను...
నా బౌలింగ్ యాక్షన్ విభిన్నంగా ఉంటుందని నేను కూడా ఎప్పుడూ గమనించలేదు. ఐపీఎల్‌లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌ని విశ్లేషించడం మొదలెట్టారు...
అయితే నాకెప్పటికీ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఆసక్తి. ఇన్‌స్వింగర్స్ వేయగలను, కానీ అవుట్ స్వింగర్స్ వేయలేదు. చిన్నతనం నుంచి అన్ని రకాల బంతులు వేయాలనేది నా కోరిక...
భారీ సిక్సర్లు కొడుతుంటే చూడడం, భారీ స్కోరింగ్ మ్యాచులు చూడడం నాకు నచ్చదు. వికెట్లు త్వరత్వరగా పడుతుంటే నాకు ఆసక్తి కలుగుతుంది. కానీ మరీ దారుణంగా పడిపోకూడదు...’ అంటూ రవి అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు జస్ప్రిత్ బుమ్రా...