MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Jasprit Bumrah Net Worth: ఐపీఎల్‌లో కోట్లు, గ్యారేజీలో మేబ్యాక్.. జస్ప్రీత్ బుమ్రా సంపాదన ఎంత?

Jasprit Bumrah Net Worth: ఐపీఎల్‌లో కోట్లు, గ్యారేజీలో మేబ్యాక్.. జస్ప్రీత్ బుమ్రా సంపాదన ఎంత?

Jasprit Bumrah Net Worth 2026: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో యార్కర్లతో వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఆదాయంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 03 2026, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులు, కోట్ల విలువైన కార్లు, అహ్మదాబాద్‌లో విల్లా.. ఇదీ బుమ్రా రాయల్ లైఫ్‌స్టైల్
Image Credit : X/Jaspritbumrah93

బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులు, కోట్ల విలువైన కార్లు, అహ్మదాబాద్‌లో విల్లా.. ఇదీ బుమ్రా రాయల్ లైఫ్‌స్టైల్

టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో యార్కర్లు వేస్తే ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు ఎలా ఎగిరిపడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ బౌలర్‌గా పేరుతెచ్చుకున్న బుమ్రా.. మైదానం వెలుపల తన బ్రాండ్ వాల్యూతో భారీగానే సంపాదిస్తున్నాడు.

2026 నాటికి వివిధ రిపోర్టుల, ఫైనాన్షియల్ ట్రాకర్ల అంచనా ప్రకారం బుమ్రా నెట్ వర్త్ సుమారు ₹60 కోట్ల నుంచి ₹80 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 2013లో చాలా నార్మల్‌గా కేవలం ₹10 లక్షల ఐపీఎల్ డీల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన బుమ్రా, ఈ రోజు దేశంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు. మరి ఈ కోట్లాది రూపాయిల సంపాదన బుమ్రాకు ఎక్కడి నుంచి వస్తుందో, ఆయన కార్లు, ఆస్తుల సంగతేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ శాలరీ: మెగా అమౌంట్ రిటెన్షన్
Image Credit : ANI

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ శాలరీ: మెగా అమౌంట్ రిటెన్షన్

బుమ్రా ఇన్ కమ్ సోర్సెస్‌లో అన్నింటికంటే బిగ్గెస్ట్ షేర్ ఐపీఎల్ లీగ్ నుంచే వస్తుంది. 2013 నుంచి ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీకి వెన్నెముకగా నిలిచిన బుమ్రాను ఐపీఎల్ 2026 సీజన్ కోసం మేనేజ్‌మెంట్ ఏకంగా ₹18 కోట్లకు రిటైన్ చేసుకుంది. లీగ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ ప్లేయర్ల లిస్టులో బుమ్రా ముందుంటాడు. ప్రతీ సీజన్‌కు వచ్చే ఈ ₹18 కోట్ల ఫిక్స్డ్ శాలరీ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌ను విపరీతంగా పెంచేసింది.

36
బీసీసీఐ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు
Image Credit : X/Jaspritbumrah93

బీసీసీఐ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు

ఇండియన్ క్రికెట్ బోర్డు (BCCI) ఇచ్చే వార్షిక కాంట్రాక్ట్ కూడా బుమ్రాకు ప్రధాన ఆదాయ మార్గం. బీసీసీఐ 2025-26 కాంట్రాక్ట్ సైకిల్‌లో A+ కేటగిరీలో ఉన్నాడు. అత్యున్నత శ్రేణిగా గ్రేడ్ ఏ కేటగిరీని కొనసాగించింది. దీని ప్రకారం బుమ్రా గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. దీని ద్వారా వచ్చే వార్షిక పారితోషికంతో పాటు ప్రతి మ్యాచ్‌కు బోర్డు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లిస్తుంది.

• టెస్ట్ మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹15 లక్షలు

• వన్డే మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹6 లక్షలు

• టీ20I మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹3 లక్షలు

ఈ మ్యాచ్ ఫీజులు, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్‌ల ద్వారానే ఏటా సుమారు ₹3 కోట్ల నుంచి ₹5 కోట్ల దాకా అదనపు ఆదాయం బుమ్రా ఖాతాలో చేరుతుంది.

46
బ్రాండ్ ఎండార్స్‌‌మెంట్లు.. యాడ్స్ ల జోరు
Image Credit : X/Jaspritbumrah93

బ్రాండ్ ఎండార్స్‌‌మెంట్లు.. యాడ్స్ ల జోరు

కేవలం క్రికెట్ గ్రౌండ్ మాత్రమే కాదు, బుమ్రా యాడ్ ఫిల్మ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ప్రపంచంలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. డ్రీమ్ 11, బోట్, అసిక్స్, వన్‌ప్లస్, థమ్స్ అప్, జెప్టో, యిప్పీ, స్కెచర్స్, జాగల్, టాటా మోటార్స్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక రిపోర్టు ప్రకారం బుమ్రా దాదాపు 20 రకాల బ్రాండ్లతో కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఒక్కో యాడ్ క్యాంపెయిన్ లేదా ఎండార్స్‌మెంట్ డీల్ కోసం బుమ్రా రోజుకు ₹1.5 కోట్ల నుంచి ₹3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. దీని ద్వారా ఏటా ఆయనకు ₹8 కోట్ల నుంచి ₹15 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.

56
అహ్మదాబాద్ డ్రీమ్ హోమ్, ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్లు
Image Credit : X/Jaspritbumrah93

అహ్మదాబాద్ డ్రీమ్ హోమ్, ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్లు

సంపాదించిన డబ్బును బుమ్రా రియల్ ఎస్టేట్, అదర్ డిజిటల్ అసెట్స్‌లో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సొంత స్వస్థలమైన అహ్మదాబాద్‌లో ఒక లగ్జరీ డిజైనర్ హౌస్ ఉంది. ఈ ఇంటి మార్కెట్ విలువ దాదాపు ₹3 కోట్ల నుంచి ₹4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు ముంబైలో కూడా బుమ్రాకు ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఇతర చోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

66
కళ్ళు చెదిరే బుమ్రా లగ్జరీ కార్ల కలెక్షన్
Image Credit : X/Jaspritbumrah93

కళ్ళు చెదిరే బుమ్రా లగ్జరీ కార్ల కలెక్షన్

క్రికెట్ స్టార్లకు కార్లంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుమ్రా గ్యారేజీలో కూడా సూపర్ ఫాస్ట్ అండ్ లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది..

• Mercedes-Maybach S560: అతి ఖరీదైన, లగ్జరీ ఫీచర్లు ఉన్న ఈ కార్ విలువ సుమారు ₹2 కోట్లకు పైమాటే.

• Nissan GT-R: వేగానికి మారుపేరైన ఈ సూపర్ కార్ విలువ కూడా ₹2 కోట్లకు పైగా ఉంటుంది.

• Range Rover Velar: దాదాపు ₹90 లక్షల విలువైన మోస్ట్ రాయల్ ఎస్యూవీ.

• Toyota Innova Crysta, Hyundai Verna: నిత్యం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే ఇతర కార్లు.

ఇలా క్రికెట్ మైదానంలో టీమిండియాను గెలిపించే వికెట్ టేకింగ్ బౌలర్‌గా ఎదిగిన బుమ్రా, తన హార్డ్ వర్క్‌‌తో ఈ స్థాయిలో కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? ఈ రూల్స్ తెలుసా?
Recommended image2
World Cup 2027: కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.. మరి రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? గంభీర్ సీక్రెట్ స్కెచ్
Recommended image3
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? ఈ రూల్స్ తెలుసా?
Recommended image2
Lovlina Borgohain: బర్త్‌డే రోజున హిస్టరీ క్రియేట్ చేసిన లవ్లీనా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved