- Home
- Sports
- Cricket
- 14 నెలల తర్వాత రీఎంట్రీ... మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బుమ్రా...
14 నెలల తర్వాత రీఎంట్రీ... మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బుమ్రా...
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, 14 నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో మొదటి ఓవర్‌లో 2 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడలేకపోయాడు జస్ప్రిత్ బుమ్రా.. బుమ్రా అప్పుడొస్తాడు? ఇప్పుడొస్తాడు? అని వార్తలు వినిపించినా, రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా సమయమే పట్టింది..
ఐర్లాండ్‌తో తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా. టీమిండియాకి టీ20ల్లో కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించి, టెస్టుల్లోనూ కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు బుమ్రా...
రీఎంట్రీలో జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి బంతికి ఆండ్రూ బాల్బరీన్ ఫోర్ బాదాడు. అయితే రెండో బంతికి బాల్బరీన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఆ తర్వాత 3, 4 బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన లోర్కన్ టక్కర్, సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
రీఎంట్రీ తర్వాత వేసిన మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు జస్ప్రిత్ బుమ్రా. టీ20ల్లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు బుమ్రా. ఇంతకుముందు 2022లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు హార్ధిక్ పాండ్యా..
టీ20ల్లో మొదటి ఓవర్‌లో 2 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు 2016లో రవిచంద్రన్ అశ్విన్, శ్రీలంకపై.. 2022లో ఆఫ్ఘాన్‌పై భువనేశ్వర్ కుమార్, 2023లో వెస్టిండీస్‌పై హార్ధిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించారు..
టీ20ల్లో 72 వికెట్లు పూర్తి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా, టీమిండియా తరుపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ రికార్డును సమం చేశాడు. యజ్వేంద్ర చాహాల్ 96, భువనేశ్వర్ కుమార్ 90, హార్ధిక్ పాండ్యా 73 వికెట్లతో అశ్విన్, బుమ్రా కంటే ముందున్నారు..