- Home
- Sports
- Cricket
- ‘సేన’ దేశాలపై బుమ్రా అరుదైన ఘనత.. కపిల్ దేవ్, కుంబ్లే ల సరసన నిలిచిన టీమిండియా కెప్టెన్
‘సేన’ దేశాలపై బుమ్రా అరుదైన ఘనత.. కపిల్ దేవ్, కుంబ్లే ల సరసన నిలిచిన టీమిండియా కెప్టెన్
ENG vs IND: టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో అరుదైన ఘనత సాధించాడు.

రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ టెస్టులో టీమిండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా టెస్టులలో అరుదైన ఘనత సాధించాడు. ‘సేన’ దేశాలపై టెస్టులలో వందకు పైగా వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు.
క్రికెట్ పరిభాషలో సేన (SENA) దేశాలు అంటే.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ను పై విధంగా వ్యవహరిస్తారు. ఈ నాలుగు దేశాల పై కలిపి టెస్టులలో వంద వికెట్లు తీశాడ బుమ్రా..
Image credit: Getty
ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. టెస్టులలో బుమ్రా ఇంగ్లాండ్ పై 36 వికెట్లు.. ఆసీస్ పై 32 వికెట్లు పడగొట్టాడు.
ఇక న్యూజిలాండ్ పై ఆరు వికెట్లు తీసిన బుమ్రా.. సౌతాఫ్రికాలో 26 వికెట్లు తీశఆడు. మొత్తంగా ఈ నాలుగు దేశాలపై కలిపి 101 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బౌలర్ అయ్యాడు.
గతంలో ఈ జాబితాలో కపిల్ దేవ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, అనిల్ కుంబ్లే ఉండేవాళ్లు. తాజాగా వీరికి బుమ్రా జతకలిశాడు.
సేన దేశాలపై అనిల్ కుంబ్లే 141 వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ 130 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 119 వికెట్లు నేలకూల్చగా.. మహ్మద్ షమీ కూడా 119 వికెట్లతో జహీర్ తో సమానంగా నిలిచాడు.
Image Credit: Getty Images
ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 117 వికెట్లు తీశాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా.. 101 వికెట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక తన కెరీర్ లో బుమ్రా ఇప్పటివరకు 29 టెస్టులలో 123 వికెట్లు తీయగా.. అగ్ర శ్రేణి జట్లైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మీదే అత్యధిక వికెట్లు పడగొట్టడం విశేషం.