- Home
- Sports
- Cricket
- రక్తం కారుతున్నా, క్రీజు దాటలేదు... 39 ఏళ్ల వయసులో అండర్సన్, నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్...
రక్తం కారుతున్నా, క్రీజు దాటలేదు... 39 ఏళ్ల వయసులో అండర్సన్, నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్...
క్రికెట్‌లో పేస్ బౌలర్లు సుదీర్ఘకాలం కొనసాగడం చాలా కష్టం. అయితే అసాధారణంగా 18 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో కొనసాగుతూ 600+ వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్... ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టుతో తన డెడికేషన్‌తో మరోసారి ట్రెండ్ అవుతున్నాడు...

మూడో టెస్టులో ఆరంభ స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసి, టీమిండియాను స్వల్ప స్కోరుకి ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జేమ్స్ అండర్సన్... నాలుగో టెస్టులో ఛతేశ్వర్ పూజారా వికెట్ తీశాడు...
టెస్టుల్లో పూజారాను అత్యధికంగా 11 సార్లు అవుట్ చేసిన అండర్సన్... ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని కాలి నుంచి రక్తం కారి, ప్యాంటుకి రక్తపు మరకలు అయ్యాయి...
కాలి నుంచి రక్తం కారుతున్నా, ఫిజియో సాయం తీసుకోకుండా ఆ ఓవర్‌ను పూర్తిచేశాడు జేమ్స్ అండర్సన్. 39 ఏళ్ల వయసులో ఆటపై తనకున్న అంకిత భావాన్ని చూపిస్తూ, క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు అండర్సన్...
ఇంగ్లాండ్‌లో 95వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న జేమ్స్ అండర్సన్, స్వదేశంలో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు...
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో స్వదేశంలో 94 టెస్టులు ఆడగా, రికీ పాంటింగ్ 92, అలెస్టర్ కుక్ 89, స్టీవ్ వా 89 టెస్టు మ్యాచులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు...