గేల్, రోహిత్ సహా ఈ ఐదుగురు క్రికెటర్ల రికార్డులు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు..
Unbreakable Cricket Records : క్రికెట్‌లో బ్రేక్ చేయలేని ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. వాటిలో భారత కెప్లెన్ రోహిత్ శర్మ, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సహా ఐదుగురు క్రికెటర్లు సాధంచిన రికార్డులను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ఐదు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
rohit sharma gayle
రోహిత్ శర్మ 264 పరుగుల ఇన్నింగ్స్
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. ఈ ప్రపంచ రికార్డు బహుశా భవిష్యత్తులో ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్‌ను బద్దలు కొట్టలేకపోవచ్చు.
Image credit: Sandeep Rana
ఐపీఎల్‌లో గేల్ 175 పరుగుల ఇన్నింగ్స్
వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 2013 ఐపీఎల్‌లో పూణే వారియర్స్ పై ఒక ఇన్నింగ్స్ లో ఏకంగా 175 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో సృష్టించిన ఈ ప్రపంచ రికార్డును ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ బ్రేక్ చేయలేదు. రానున్న కాలంలో కూడా బహుశా ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోవచ్చు.
హాఫ్ సెంచరీ లేకుండానే వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు
వన్డే క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని వన్డే కెరీర్ లో గమనిస్తే 162 మ్యాచ్‌లలో 43.41 సగటుతో 5122 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. మిస్బా-ఉల్-హక్ ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం.
ఒక టెస్టులో 19 వికెట్లు
ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒకే టెస్టు మ్యాచ్‌లో 19 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 68 ఏళ్లుగా ప్రపంచంలోని ఏ బౌలర్ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. బహుశా భవిష్యత్తులో ఏ బౌలర్‌కు అలా చేయడం సాధ్యం కాదేమో.
chaminda vaas
వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు
శ్రీలంక మాజీ బౌలర్ చమిందా వాస్ 2001లో వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 23 ఏళ్లుగా చమిందా వాస్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ప్రపంచంలోని ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. బహుశా భవిష్యత్తులో ఏ బౌలర్‌కు కూడా ఇలా చేయడం అసాధ్యం కావచ్చు. ఆ మ్యాచ్‌లో చమిందా వాస్ 19 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.