జరిగింది ఒకే టెస్టు... రహానేని అప్పుడే మోసేయకండి... మిగిలిన రెండు టెస్టుల్లో...

First Published Jan 1, 2021, 12:47 PM IST

విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ప్లేయర్లు దూరమైన భారత జట్టుతో ఆస్ట్రేలియాను ఓడించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా ఫెయిల్ అయినా, టీమిండియాను ముందుండి నడిపించి చారిత్రక విజయాన్ని అందించాడు. దీంతో రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఒక్క టెస్టుతో అతని కెప్టెన్సీని మెచ్చుకోవడం తొందరపాటు అవుతుందని అంటున్నాడు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీప్ దాస్‌గుప్తా.

ఇప్పటిదాకా భారత జట్టుకి మూడు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే... మూడింట్లోనూ టీమిండియాకు విజయాలను అందించాడు..

మొదటి మూడు టెస్టుల్లో విజయాలను అందుకున్న భారత కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు అజింకా రహానే... రహానే కెప్టెన్సీలో టీమిండియా గెలిచిన రెండు విజయాలు ఆస్ట్రేలియాపైనే కావడం మరో విశేషం...

బాక్సింగ్ డే టెస్టులో బ్యాటుతో కూడా రాణించిన అజింకా రహానే 223 బంతుల్లో 112 పరుగులు చేసి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు...

‘రహానే గురించి తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కానీ అతన్ని ఇప్పుడే పొగడడం కరెక్టు కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అతను గెలిచింది ఒకే టెస్టు...

రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు కూడా జట్టును నడిపిస్తున్నారు... ఈ గెలుపు గుర్రాలను కరెక్టుగా నడిపించడంలో రహానే సక్సెస్ అయ్యాడు...

రహానేని పొగడడం తప్పు కాదు, కానీ విరాట్ కోహ్లీతో పోల్చి చూడడం మాత్రం కరెక్ట్ కాదు... ఎవరి స్టైల్ వారిది, ఎవరి కెప్టెన్సీ వారికి తగ్గట్టుగా ఉంటుంది...

గత పర్యటనలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఏడో స్థానంలో ఉన్న టీమిండియాను, టెస్టుల్లో నెం.1 టీమ్‌గా మార్చిన కెప్టెన్ అతను...

విరాట్ కోహ్లీలాగే అజింకా రహానే కూడా జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడంటే భారత జట్టులో లీడర్‌షిప్ క్వాలిటీలు ఎక్కువగా ఉన్నాయని మనం సంతోషించాలి...

అంతేకానీ కొందరు టెస్టుల్లో అజింకా రహానేని కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది... ఆడిలైడ్ ప్రదర్శన విరాట్ పొరపాటు కాదు...

ఆడిలైడ్‌లో కూడా టీమిండియా అద్భుతంగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి, ఆస్ట్రేలియాకు డే నైట్ టెస్టులో షాక్ ఇచ్చింది...

ఒక దురదృష్టపు సెషన్ కారణంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు... అలాంటి సందర్భాల్లో కెప్టెన్ ఏమీ చేయలేడు...’ అంటూ వ్యాఖ్యానించాడు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీప్ దాస్‌గుప్తా...

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?