టీమిండియా హెడ్ కోచ్‌గా అదే అత్యంత కష్టమైన రోజు.. : రాహుల్ ద్రవిడ్
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవీ కాలంలో మూడు ఫార్మాట్లలో టీమిండియాను నెంబర్ వన్ గా నిలబెట్టాడు. కానీ, వరుసగా ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఓటముల మధ్య ద్రవిడ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ ప్రపంచ క్రికెట్ లో లెజెండరీ ప్లేయర్. భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు.ప్లేయర్ గానే కాకుండా ప్రధాన కోచ్ గా జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. యావత్ భారతావని గర్వించదగ్గ ఆటగాడిగా, కోచ్ గా గుర్తింపు సాధించాడు.
Rahul Dravid
భారత్ జట్టును మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలబెట్టిన రాహుద్ ద్రవిడ్.. కోచ్ గా ఉన్న సమయంలో ఏదుర్కొన్న చాలా బాధాకరమైర రోజులను గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ''మేము కొంతకాలంగా చాలాసార్లు పెద్ద ట్రోఫీకి దగ్గరగా వచ్చాము. తొలుత 20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాము.. అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాము. దీంతో పాటు వన్డే ప్రపంచ కప్ 2024 ఫైనల్ లో కూడా ఆడాము కానీ, జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకోలేక పోయిందని" తెలిపారు.
ఈ సమయంలో అనేక విమర్శలను ఎదుర్కొన్నామని తెలిపిన రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ 2024 ను గెలిచిన తర్వాత జట్టుకు, గత రెండున్నరేళ్లుగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ చాలా మంచి అనుభూతిని కలిగిందని తెలిపారు. అందుకే సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పారు. మొత్తంమీద ప్రధాన కోచ్ గా వీడ్కోలు ఆనందంతో ముగిసిందని తెలిపారు.
రాహుల్ ద్రవిడ్ నవంబర్ 2021లో తన కోచింగ్ బాధ్యతలు స్వీకరించాడు. తన మొదటి విదేశీ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఇది కోచ్ గా ఉన్న సమయంలో అత్యంత కష్టమైన సమయంగా ద్రవిడ్ పేర్కొన్నాడు.
Rahul Dravid
'దక్షిణాఫ్రికా పర్యటన మాకు చాలా కష్టతరమైన పర్యటన. ఆ పర్యటనలో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించాం. దక్షిణాఫ్రికా గడ్డపై మేం ఏ టెస్టు సిరీస్‌ను గెలవలేదని అందరికీ తెలుసు. ఇది మాకు పెద్ద అవకాశం. అయితే, ఒక విషయం ఏమిటంటే, ఆ సమయంలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు మా జట్టులో లేరు. ఆ తర్వాత రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మరికొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టులో లేరని" రాహుల్ ద్రవిడ్ తెలిపారు.