- Home
- Sports
- Cricket
- మేం రమ్మనలేదు! బెన్ స్టోక్స్ స్వయంగా వన్డే వరల్డ్ కప్ ఆడతానని చెప్పాడు... - ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్
మేం రమ్మనలేదు! బెన్ స్టోక్స్ స్వయంగా వన్డే వరల్డ్ కప్ ఆడతానని చెప్పాడు... - ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ తిరిగి వన్డేల్లోకి రావడంతో ఇంగ్లాండ్, విన్నింగ్ ఛాన్సులు పెరిగాయనేది ఎవ్వరూ కాదనేలేని నిజం...

Ben Stokes
ఇన్ని రోజులు వన్డేలు ఆడకుండా సెడన్‌గా రీఎంట్రీ ఇవ్వడం వల్ల ఇన్ని రోజులు వరల్డ్ కప్ ఆడాలని కలలు కన్న మరో ప్లేయర్ ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి ఉంటుంది..
యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్. అయితే ఆ తర్వాత వారం రోజులకే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో బెన్ స్టోక్స్‌కి చోటు దక్కింది. బెన్ స్టోక్స్ రీఎంట్రీకి వన్డే కెప్టెన్ జోస్ బట్లర్ అనుకున్నారు చాలామంది..
Ben Stokes
అయితే బెన్ స్టోక్స్‌ని తిరిగి వన్డే టీమ్‌లోకి రావాలని తాను అడగలేదని అంటున్నాడు జోస్ బట్లర్. ‘నిజానికి వన్డే రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలనేది బెన్ స్టోక్స్ నిర్ణయం. అతను అన్ని విషయాల్లో పక్కాగా ఉంటాడు. అతన్ని వరల్డ్ కప్ ఆడమని నేను అడగలేదు, అడగాలని కూడా అనుకోలేదు. నాకు తెలిసి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో ఎవ్వరూ అడిగి ఉండకపోవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు జోస్ బట్లర్..
Image credit: Getty
ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇదెలా ఉందంటే నేను, నా టీమ్, నా ఇష్టం అన్నట్టుగా..ఎక్కడ ఆడాలో, ఎప్పుడు ఆడాలో నేనే నిర్ణయం తీసుకుంటా.
Ben Stokes
కేవలం బిగ్ టోర్నమెంట్స్ ఆడతా. అవసరమైతే ఏడాదిగా ఆడుతున్నవాడిని బెంచీలో కూర్చోమని చెబుతా, ఎందుకంటే నేను తిరిగి ఆడాలనుకుంటున్నా కాబట్టి.. బెన్ మరీ ఇంత స్వార్థం పనికి రాదు..’ అంటూ కామెంట్ చేశాడు టిమ్ పైన్..
తన కెరీర్‌లో 105 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్, 38.98 యావరేజ్‌తో 2924 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 74 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్ రీఎంట్రీతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా మారింది ఇంగ్లాండ్ జట్టు..