ఇషాన్ కిషన్ బాగా ఆడాడు కానీ, ఇది కాదు కావాల్సింది... సునీల్ గవాస్కర్ కామెంట్...
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి, హాఫ్ సెంచరీ నమోదు చేశాడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. 89 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా టాప్‌లో నిలిచాడు...

56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, కెరీర్‌లో రెండో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కి 8 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన అర్ధ శతకం ఇదే...
వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో 71 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 85.5 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు...
‘ఇషాన్ కిషన్, తొలి టీ20 మ్యాచ్‌లో బాగా ఆడాడు. అతను తాను ఏం చేయగలడో చూపించాడు. అయితే ఇది ఇంకా మొదటి టీ20 మాత్రమే...
వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో అతను చాలా ఇబ్బందిపడ్డాను. శ్రీలంక బౌలర్లతో పోలిస్తే విండీస్ బౌలర్ల లైన్, లెంగ్త్, పేస్, బౌన్స్ అన్నీ వేరే...
శ్రీలంక బౌలర్ల బౌలింగ్‌లో ఈజీ ఫుల్ షాట్స్ ఆడాడు ఇషాన్ కిషన్. అతని ఇన్నింగ్స్ గొప్పదే, అందులో కొన్ని చక్కని డ్రైవ్స్ ఉన్నాయి, ఫుల్ షాట్స్ ఉన్నాయి...
అయితే అతని నుంచి నిలకడైన ప్రదర్శన కావాలి. ఇలాంటి ఇన్నింగ్స్‌లు వరుసగా రావాలి. మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదితే బెటర్...
వరుసగా ఇలాంటి పర్ఫామెన్స్‌లు ఇస్తుంటే, ఇషాన్ కిషన్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ మూడు అవసరాలు తీరుస్తాడు...
మొదటిది అతను వికెట్ కీపర్, అదీకాక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇషాన్ టాపార్డర్‌లో ఓపెనర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేసి షినిషర్‌గా రాణించగలడు...
అయితే అతను నిలకడైన ప్రదర్శన ఇవ్వకపోతే, అప్పుడప్పుడూ వచ్చే ఇలాంటి ఇన్నింగ్స్‌ల కోసం ఇషాన్ కిషన్‌ను టీమ్ భరించలేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...