మయాంక్ అగర్వాల్ పోయి, ఇషాన్ కిషన్ వచ్చే... వెస్టిండీస్‌తో మొదటి వన్డేకి ముందు...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు? ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు...

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం అహ్మదాబాద్‌కి చేరుకున్న భారత బృందంలో నలుగురు క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే...
ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, స్టాండ్ బై ప్లేయర్ నవ్‌దీప్ సైనీ కరోనా పాజిటివ్‌గా తేలారు...
మిగిలిన ప్లేయర్లకు చేసిన పరీక్షల్లో అందరూ నెగిటివ్‌గా తేలడంతో గురువారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది భారత జట్టు....
శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారిన పడడంతో మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు.
అయితే సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బయో బబుల్ వీడిన మయాంక్ అగర్వాల్, అహ్మదాబాద్ చేరుకుని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతని క్వారంటైన్ ఫిబ్రవరి 6న ముగియనుంది...
అదే రోజు ఇండియా, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే ముగియనుంది. దీంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను కూడా వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు...
టీ20 సిరీస్‌కి ఎంపికైన ఇషాన్ కిషన్ ఇప్పటికే మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోవడంతో తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది...
కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్... వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇషాన్ కిషన్, మయాంక్ అగర్వాల్‌లను ఓపెనర్లుగా వాడుకోవాలని భావిస్తోంది టీమిండియా...
అహ్మదాబాద్‌లో ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే తొలి వన్డే, భారత్ కెరీర్‌లో 1000వ వన్డే మ్యాచ్. పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి వన్డే మ్యాచ్‌తోనే మైలురాయిని అందుకోనున్నాడు రోహిత్ శర్మ...