MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ‌ద్ద‌లు.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన 14 ఏళ్ల క్రికెటర్

వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ‌ద్ద‌లు.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన 14 ఏళ్ల క్రికెటర్

Triple Century in ODIs: క్రికెట్ లో మరీ ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం ప్రతి ఆటగాడి కల. అయితే ప‌లువురు ప్లేయ‌ర్లు వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ సాధించారు. ఇక అసాధ్యం అనుకునే వ‌న్డే  ట్రిపుల్ సెంచ‌రీని 14 ఏళ్ల క్రికెట్ ప్లేయ‌ర్ సాధించి రికార్డుల మోత మోగించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 07 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Virender Sehwag, India, Ira Jadhav

Virender Sehwag, India, Ira Jadhav

Triple Century in ODIs: ప్ర‌పంచ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న విష‌యాల‌ను సుసాధ్యం చేసి చూపిన ప్లేయ‌ర్లు చాలా మందే ఉన్నారు. టెస్టు క్రికెట్ లో సెంచ‌రీ, డ‌బుల్ సెంచ‌రీ సాధార‌ణ‌మే అయినా, కొంద‌రు ప్లేయ‌ర్లు 300, 400 మార్కును కూడా అందుకున్నారు. 

ఇవే ప‌రుగులు వ‌న్డే విషయానికి వ‌స్తే హాఫ్ సెంచ‌రీ, సెంచ‌రీ సాధార‌ణ‌మే అయినా.. డబుల్ సెంచ‌రీని కూడా సాధించిన స్టార్లు ఉన్నారు. ట్రిపుల్ సెంచ‌రీ దాదాపు అసాధ్యం అనుకుంటున్న ప‌రిస్థితులు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది లెజెండ‌రీలు క్రికెట్ లో అద‌ర‌గొట్టిన వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ మార్కును అందుకోలేక‌పోయారు. కానీ, లెజెండ‌రీల‌కు సాధ్యంకాని వ‌న్డే ట్రిపుల్ సెంచ‌రీని ఒక 14 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ira Jadhav

Ira Jadhav

వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ ఎవరో తెలుసా?

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం ప్రతి ఆటగాడి కల. ఈ విషయంలో టీం ఇండియా అనుభవజ్ఞుడు రోహిత్ శర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన ప్లేయ‌ర్. కానీ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ అంటే అది కొత్త అద్భుత‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రు దానిని అందుకోలేదు. 

అయితే, వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ అద్భుతాన్ని 14 ఏళ్ల ప్లేయ‌ర్ ఇరా జాదవ్ నిజం చేశారు. ఇంత చిన్న వయసులోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల ఈ ప్లేయ‌ర్ మ్యాచ్ అంతటా ఫోర్లు, సిక్సర్లలో ప‌రుగుల వ‌ర్షం కురిపించింది. 

35
Ira Jadhav

Ira Jadhav

ఇరా జాదవ్ ఎవరు?

14 ఏళ్ల ఇరా జాదవ్ అండర్-19 జట్టులో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించింది. గత నెలలో మేఘాలయతో జరిగిన మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో ఆమె పరుగుల వ‌ర‌ద‌పారిస్తూ చరిత్ర సృష్టించింది. ఈ 14 ఏళ్ల బాలిక తన దూకుడు శైలితో బౌలర్లకు నిద్ర‌లేని రాత్రుల‌ను చూపించింది. ఇరా జాద‌వ్ కేవలం 157 బంతుల్లో 346 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇరా ఈ ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 16 సిక్స‌ర్లు ఉన్నాయి.

45

మహిళా క్రికెట్‌లో తొలి ప్లేయ‌ర్ గా ఇరా జాద‌వ్ రికార్డు

భారత మహిళా క్రికెట్ చరిత్రలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన వారు ఎవ‌రూ లేరు. కానీ, ఇప్పుడు ఇరా జాదవ్ ఈ రికార్డును అందుకున్నారు. ఇరా జాదవ్ బ్యాటింగ్ ప‌వ‌ర్ ముందు మేఘాలయ బౌలర్లు వేడుకోవ‌డం ఒక్క‌టే మిగిలింది. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) నిర్వహించే టోర్నమెంట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఇరా జాద‌వ్ నిలిచారు. 

55
<p>Bat Ball</p>

<p>Bat Ball</p>

వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలుకొట్టిన ఇరా జాద‌వ్

ఈ అద్భుతమైన ట్రిపుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్‌తో ఇరా జాదవ్ భార‌త జ‌ట్టు మాజీ ఓపెన‌ర్, ఢాషింగ్ ప్లేయ‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. గొప్ప ఆటగాళ్ళు కూడా సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. ముంబై తరఫున ఇరా ఓపెనింగ్స్ చేస్తోంది. 2008లో సెహ్వాగ్ అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును సృష్టించాడు. సెహ్వాగ్ కేవలం 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇరా జాద‌వ్ ఇప్పుడు ఏకంగా వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ, అది కూడా అత్యంత వేగవంత‌మైంది సాధించారు. 157 బంతుల్లో 346 పరుగులతో అజేయంగా నిలిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved