- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 మెగా వేలం: వార్నర్‌ని సగం ధరకే కొనేశారు... సరోజిని నగర్ మార్కెట్‌లో బేరమాడినట్టు...
ఐపీఎల్ 2022 మెగా వేలం: వార్నర్‌ని సగం ధరకే కొనేశారు... సరోజిని నగర్ మార్కెట్‌లో బేరమాడినట్టు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండు సెట్ల వరకూ ఒక్క ప్లేయర్‌ను కూడా కొనుగోలు చేయలేదు. మార్క్యూరీ రౌండ్‌లో ఒక్క ప్లేయర్ కోసం కూడా కనీసం బిడ్ వేయని సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండో సెట్‌లో మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసింది. అయితే మనీశ్ పాండే కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.4.6 కోట్లు వెచ్చించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకుంది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.6.25 కోట్లకు దక్కించుకుంది. 2009లో ఢిల్లీ జట్టుతో (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన డేవిడ్ వార్నర్, 2014 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు...
ఐపీఎల్ 2014 సీజన్‌లో రూ.5.5 కోట్లకు డేవిడ్ వార్నర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2019లో రిటైన్ చేసుకున్న తర్వాత రూ.12.5 కోట్లు చెల్లించింది.
మూడు సీజన్ల పాటు రూ.12.5 కోట్లు తీసుకున్న డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో సరిగ్గా సగం ధరకే దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...
‘ఢిల్లీ ప్రజలకు బేరం ఎలా ఆడాలో బాగా తెలుసు. డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకే దక్కించుకోవడనేది సరోజిని నగర్ మార్కెట్ లెవెల్ బేరమే...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
‘డేవిడ్ వార్నర్‌ను ఇంత తక్కువ ధరకు దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు...
ఓపెనర్‌గా అద్భుత రికార్డులు క్రియేట్ చేశాడు. పృథ్వీషాతో కలిసి డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ చేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్...
ఐపీఎల్ 2022 ఆక్షనర్ హ్యూజ్ ఎడ్మర్డ్స్ అస్వస్థతకు గురి కావడంతో అతని స్థానంలో చారు శర్మ ఐపీఎల్ మెగా వేలాన్ని ఆక్షనర్‌గా నడిపించబోతున్నాడు...
హ్యూజ్ ఎడ్మర్డ్స్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న చారు శర్మ, ఆఫీసుకి చేరుకోవడానికి సమయం పట్టడంతో వేలం ఆలస్యంగా తిరిగి ప్రారంభమైంది..