- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ ఐదుగురే హాట్ కేక్స్... వీరేంద్ర సెహ్వాగ్ ఫెవరెట్ ఇండియన్ ప్లేయర్స్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ ఐదుగురే హాట్ కేక్స్... వీరేంద్ర సెహ్వాగ్ ఫెవరెట్ ఇండియన్ ప్లేయర్స్...
ఐపీఎల్ 2022 మెగా వేలంపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. లీగ్ చరిత్రలో ఇదే ఆఖరి మెగా వేలం అనే టాక్ వినిపిస్తుండడంతో ఈసారి ఎవరు జాక్ పాట్ కొట్టేస్తారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఈ వేలంలో ఐదుగురు భారత ప్లేయర్లు ఎక్కవ ధర దక్కించుకుంటారని అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలి రోజు 161 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. తొలి సెట్‌లో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, డుప్లిసిస్, క్వింటన్ డి కాక్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్లు వేలంలోని రానున్నారు...
10 ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న 33 మంది క్రికెటర్లు మినహా, మెగా వేలం కోసం రిజిస్టర్ చేయించుకున్నవారిలో షార్ట్ లిస్టు చేయబడిన 590 క్రికెటర్లు ఈ మెగా వేలంలో తన లక్‌ను పరీక్షించుకోబోతున్నారు...
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా ప్రకారం భారత క్రికెటర్లలో ఐదుగురు క్రికెటర్లు భారీ ధర దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నాడు...
శిఖర్ ధావన్, గత ఐదు సీజన్లుగా 400+ పరుగులు చేస్తూ వస్తున్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు ఈ ఓపెనర్. శిఖర్ ధావన్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడతాయని అంటున్నారు సెహ్వాగ్...
శార్దూల్ ఠాకూర్, ఆల్‌రౌండర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భాగస్వామ్యాలను విడదీయడం శార్దూల్ ఠాకూర్ స్పెషాలిటీ. శార్దూల్ ఠాకూర్ కనీసం రూ.7-8 కోట్లు ఈజీగా కొల్లగొడతాడని అంటున్నాడు వీరూ...
శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ చేర్చిన మొట్టమొదటి క్రికెటర్. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా పరుగులు చేసే అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడతాయని, తన అంచనా ప్రకారం ఈసారి అత్యధిక ధర పలికే ప్లేయర్‌గా శ్రేయాస్ నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...
యజ్వేంద్ర చాహాల్, స్పిన్నర్‌గా ఆర్‌సీబీలో కీలక ప్లేయర్‌గా ఉంటూ వచ్చాడు. గత సీజన్‌లోనూ 18 వికెట్లు తీసిన చాహాల్, ఎకానమీతో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. చాహాల్‌కి కూడా భారీగా ప్రైజ్ దక్కొచ్చని అంటున్నారు వీరూ...
ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన యంగ్ వికెట్ కీపర్. వికెట్ కీపింగ్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీల్డర్ కూడా అయిన ఇషాన్ కిషన్ కనీసం రూ.10 కోట్లు దక్కించుకుంటాడని భావిస్తున్నాడు సెహ్వాగ్...