- Home
- Sports
- Cricket
- IPL2022 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌కి బంపర్ ఆఫర్... అమ్ముడుపోని సీనియర్లు...
IPL2022 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌కి బంపర్ ఆఫర్... అమ్ముడుపోని సీనియర్లు...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కి ఐపీఎల్ 2022 మెగా వేలంలో కనక వర్షం కురిసింది. గత సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్ స్టోన్, ఈసారి ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ని కొనుగోలు చేయడానికి కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
అయిడిన్ మార్క్‌రమ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది...
భారత బ్యాటర్ అజింకా రహానేని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన రహానే, 2022 సీజన్‌లో కేకేఆర్‌కి ఆడనున్నాడు.
ఐసీసీ నెం.1 టీ20 ప్లేయర్ డేవిడ్ మలాన్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మెన్ మార్నస్ లుబూషేన్‌ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.
మన్‌దీప్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. మన్‌దీప్ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
కేకేఆర్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ముంబై ఇండియన్స్‌కి ఆడిన సౌరబ్ తివారీ కూడా అమ్ముడుపోలేదు.
ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా వరుసగా రెండో ఐపీఎల్ సీజన్‌లోనూ అమ్ముడుపోలేదు. భారత టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్‌ని కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
విండీస్ ప్లేయర్ డొమినిక్ డ్రేక్స్ కోసం ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ పోటీపడ్డాయి. డొమినిక్ డ్రేక్స్‌ని రూ.1.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. జయంత్ యాదవ్ కోసం లక్నో సూపర్ జెయింట్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడ్డాయి. జయంత్ యాదవ్‌ని రూ.1.70 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది.
భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కోసం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. విజయ్ శంకర్‌ను రూ.1.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
విండీస్ ప్లేయర్ ఓడియన్ స్మిత్ కోసం లక్నో, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఓడియన్ స్మిత్‌ని రూ. 6 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. మార్కో జాన్సన్‌ను రూ.4.20 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే కోసం లక్నో సూపర్ జెయింట్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. శివమ్ దూబేని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు...
గత సీజన్‌లో రూ.9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్‌ని కొనుగోలు చేయడానికి కోల్‌కత్తా, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. కృష్ణప్ప గౌతమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది