LSG vs GT: సారిక్కడ.. మేడమక్కడ..!! గిల్ ఓపెనింగ్ మ్యాచుకు దూరమైన సచిన్ కూతురు..
TATA IPL2022: టీమిండియా యువ ఆటగాడు, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న శుభమన్ గిల్ కు ఇవాళ బిగ్ డే. రూ. 8 కోట్లతో తనను రిటైన్ చేసుకున్న గుజరాత్ నమ్మకాన్ని నిజం చేసేందుకు అతడు లక్నో తో కీలక మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఈ మ్యాచుకు సచిన్ కూతురు మాత్రం...

టెస్టులలో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ నేడు ఐపీఎల్ లో కొత్తగా అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచుకు సన్నద్ధమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తో నేటి సాయంత్రం 7.30 గంటలకు వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది.
అయితే ఈ మ్యాచుకు అతడి గర్ల్ ఫ్రెండ్ (?) సారా టెండూల్కర్ మాత్రం అందుబాటులో లేదు. ఐపీఎల్ మ్యాచులు ముంబైలో జరుగుతుండగా.. సారా మాత్రం ప్రస్తుతం సముద్రాల ఆవల ఉన్నది.
ఉన్నత చదువుల కోసం యూకేలో ఉంటున్న సారా.. ప్రస్తుతం స్కాట్లాండ్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నది. ఆమె తన మిత్రులతో కలిసి స్కాట్లాండ్ లో గడుపుతున్నది.
స్కాట్లాండ్ లో ఆమె ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సారా తన ఇన్స్ట్రాగ్రామ్ లో పంచుకుంది. ఇన్స్టా స్టేటస్ లో.. ఇందుకు సంబంధించిన పలు చిత్రాలను ఉంచింది.
ఈ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై గిల్, సారాలతో పాటు సచిన్ టెండూల్కర్ కూడా ఇంతవరకూ స్పందించలేదు.
అయితే ఇటీవలే శుభమన్ గిల్ - సారా ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ మేరకు గిల్ కూడా ‘దేవతలతో ప్రేమలో పడకూడదు...’అని ఉన్న టీషర్ట్ ను వేసుకోవడంతో ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని వినిపించింది.
కాగా.. గతంలో గిల్ సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసేనా లైక్ కొట్టే సారా.. కొంతకాలంగా ఆ పని చేయడం లేదు. తాజాగా ఆమె తన మోడలింగ్ కెరీర్ మీద దృష్టి పెట్టింది.
అంతర్జాతీయంగా పేరున్న ఒక వస్త్ర కంపెనీకి సంబంధించిన యాడ్ లో ఆమె మోడల్ గా వ్యవహరించింది. ఎంబీబీఎస్ చదువుతున్న సారాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె బాలీవుడ్ కు రావాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదిలాఉండగా.. 2018లో ఐపీఎల్ లో ఎంట్రీ (కేకేఆర్) ఇచ్చిన శుభమన్ గిల్ ఇప్పటివరకు ఈ క్యాష్ రిచ్ లీగ్ లో 58 మ్యాచులాడి 1,417 పరుగులు చేశాడు. 2021 సీజన్ లో కోల్కతా తరఫున ఆడుతూ.. 17 మ్యాచుల్లో 478 పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్ లో అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. కానీ గుజరాత్ అతడికి రూ. 8 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.