IPL2021 SRH vs PBKS: అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలర్లు... ఆరెంజ్ ఆర్మీ ముందు...
ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, అదిరిపోయే పర్ఫామెన్స్తో కమ్‌బ్యాక్ ఇచ్చారు... టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది...
తొలి వికెట్‌కి 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 21 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
అదే ఓవర్లో 6 బంతుల్లో 5 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
17 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన క్రిస్ గేల్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన పూరన్, సందీప్ శర్మ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
మార్క్రమ్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
10 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన దీపక్ హుడాని సుచిత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. మెరుపు వేగంతో పక్షిలా గాల్లోకి ఎగురుతూ సుచిత్ పట్టిన క్యాచ్, ఈ సీజన్లో బెస్ట్ క్యాచులలో ఒకటిగా నిలవడం ఖాయం...
ఆ తర్వాత 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన నాథన్ ఎల్లీస్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
భువీ వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్ బాదిన హర్‌ప్రీత్ బ్రార్ 18 బంతుల్లో 18 పరుగులు చేసి... పంజాబ్ కింగ్స్ ఈ మాత్రం స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు...