IPL2021 SRH vs DC: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్ భాయ్‌కి అవకాశం...
IPL2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే, ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది ఆరెంజ్ ఆర్మీ...
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్తుంది...
ఫస్టాఫ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్లో డేవిడ్ వార్నర్ తీసిన షార్ట్ రన్, జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపి... ఢిల్లీ విజయాన్ని అందుకుంది...
కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కీలకం...
ఈ మ్యాచ్‌కి ముందు నటరాజన్ కరోనా బారిన పడడం, విజయ్ శంకర్ కూడా ఐసోలేషన్లోకి వెళ్లడంతో ఆ ప్రభావం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పడనుంది..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఆవేశ్ కాన్, రబాడా, నోకియా
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్