MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 MI vs PBKS: ముంబై బౌలింగ్ అదుర్స్... కీ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

IPL2021 MI vs PBKS: ముంబై బౌలింగ్ అదుర్స్... కీ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 28 2021, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మయాంక్ అగర్వాల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్ సింగ్, కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 14 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన మన్‌దీప్ సింగ్‌ని, కృనాల్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కృనాల్ పాండ్యాకి ఐపీఎల్‌లో ఇది 50వ వికెట్... ఐపీఎల్‌లో కలీస్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, ఇర్ఫాన్ పఠాన్, రస్సెల్, జడేజా, పోలార్డ్ తర్వాత 1000+ పరుగులు, 50 వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు కృనాల్ పాండ్యా...

39

ఆ తర్వాతి ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కిరన్ పోలార్డ్... బంతితో మ్యాజిక్ చేశాడు. యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను 1 పరుగుకే పెవిలియన్ చేర్చిన పోలార్డ్, ఆ తర్వాత రెండో బంతికి కెఎల్ రాహుల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు.

49

ఐపీఎల్ చరిత్రలో క్రిస్‌‌గేల్‌ను అవుట్ చేయడం ఇది మొదటిసారి. ఇంతకుముందు 2012 బీబీఎల్‌ను పోలార్డ్ బౌలింగ్‌లో అవుటైన క్రిస్ గేల్, మళ్లీ ఇన్నాళ్లకు తన విండీస్ టీమ్‌మేట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

59

22 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, పోలార్డ్ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...  కెఎల్ రాహుల్ వికెట్‌తో టీ20ల్లో 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు కిరన్ పోలార్డ్...

69

టీ20 ఫార్మాట్‌లో 10వేలకు పైగా పరుగులు, 300 వికెట్లు తీసుకున్న మొట్టమొదటి ఆల్‌రౌండర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు కిరన్ పోలార్డ్...

79

కెఎల్ రాహుల్ అవుటైన తర్వాత నికోలస్ పూరన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్...

89

ఈ దశలో దీపక్ హుడా, మార్క్‌రమ్ కలిసి ఐదో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన మార్క్‌రమ్‌, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

99

ఆ తర్వాత 26 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన దీపక్ హుడా, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నంచి అవుట్ అయ్యాడు...
 
హర్‌ప్రీత్ బ్రార్ 19 బంతుల్లో 14, నిథాన్ ఎల్లీస్ 6 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ముగించారు.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Recommended image2
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image3
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved