MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 DC vs MI: ముంబై ఇండియన్స్‌కి షాక్... డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టం...

IPL2021 DC vs MI: ముంబై ఇండియన్స్‌కి షాక్... డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టం...

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా, ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం అదిరిపోయే ఫైటింగ్ స్పిరిట్ చూపించారు. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 02 2021, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

130 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్, పోలార్డ్ విసిరిన ఓ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన పృథ్వీషా, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ముంబై ఇండియన్స్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది...

36

8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను కౌంటర్‌నైల్ బౌల్డ్ చేయగా 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన రిషబ్ పంత్, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

46

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరగా సిమ్రన్ హెట్మయర్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

56

93 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్... ఏడో వికెట్‌కి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

66

 

ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్‌ బాదిన రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌ను ముగించాడు... అశ్విన్ 21 బంతుల్లో ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved