- Home
- Sports
- Cricket
- డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 20 రోజుల ముందే ఇంగ్లాండ్‌కి... రోహిత్ కామెంట్! ఐపీఎల్ 2023 మధ్యలో అయ్యేపనేనా...
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 20 రోజుల ముందే ఇంగ్లాండ్‌కి... రోహిత్ కామెంట్! ఐపీఎల్ 2023 మధ్యలో అయ్యేపనేనా...
ఇప్పుడు టీమిండియా ఆటతీరుని డిసైడ్ చేసేది బీసీసీఐ కాదు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలే. భారత జట్టులో ఆడడం కంటే, ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలకు ఆడడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు చాలామంది క్రికెటర్లు. ఏడాది అంతా ఆడినా రానంత డబ్బు, కేవలం 2 నెలల్లోనే వస్తుండడం దీనికి ప్రధాన కారణం...

ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడి... న్యూజిలాండ్‌తో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముందు ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆడిన టీమిండియా, గ్రూప్ స్టేజీ కూడా దాటలేకపోయింది.
Image credit: PTI
మళ్లీ ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వారం రోజులకే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. వారం రోజుల గ్యాప్‌లో భారత ప్లేయర్లు,ఇంగ్లాండ్‌కి వెళ్లి... అక్కడి వాతావరణాన్ని అలవాటుపడడం, టీ20 మూడ్ నుంచి బయటికి వచ్చి ఫైనల్ మ్యాచ్ ఆడడం అయ్యే పనేనా... దీనిపై తాజాగా కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
Image credit: Getty
‘ఐపీఎల్ కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోవడం లేదు. ఫైనల్‌కి కావాల్సినంత సమయం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. మే 21 నాటికి ఆరు టీమ్, ఎలిమినేట్ అవుతాయి. ఆ టీమ్ ప్లేయర్లను ఇంగ్లాండ్‌కి పంపించి, అక్కడ ఫైనల్ కోసం ప్రిపేర్ అయ్యేలా చర్యలు తీసుకుంటాం...
Image credit: Getty
నాకౌట్ చేరిన టీమ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా వీలైనంత త్వరగా యూకే వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తాం.. ఫైనల్ ఆడే ప్లేయర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. వాళ్లపై వర్క్‌లోడ్ లేకుండా ఏం చేయగలమో చూస్తాం.. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు డ్యూక్ బాల్స్‌ని ఫాస్ట్ బౌలర్లకు పంపించాం...
యూకేలో టెస్టు మ్యాచులు ఆడని ప్లేయర్లు ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉంటారు. మిగిలిన ప్లేయర్లకు ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో, పిచ్ పరిస్థితుల గురించి బాగా తెలుసు. ది ఓవల్‌లో పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. కాబట్టి ఫైనల్‌లో మంచి ఫైట్ ఉంటుందని ఆశిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
Image credit: PTI
జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా తరుచూ గాయపడుతున్నారు. రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌లో జరిగే ఫైనల్‌లో కీలకం కాబోతున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు...
Image credit: PTI
రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా ఉంటే విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్.. ఆర్‌సీబీలో ఉన్నారు. మహ్మద్ షమీ, శుబ్‌మన్ గిల్, కెఎస్ భరత్.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నారు..
Image credit: PTI
ఉమేశ్ యాదవ్, కేకేఆర్ తరుపున ఆడుతున్నాడు. అక్షర్ పటేల్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉంటే రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నాడు. ఫ్రాంఛైజీలను ఒప్పించి, నాకౌట్ మ్యాచుల నుంచి ఈ ప్లేయర్లను తప్పించడం అయ్యే పని కాదు.