MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL Retentions: వదిలిపెట్టలేము, అట్టి పెట్టుకోలేము... ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీ వల్ల...

IPL Retentions: వదిలిపెట్టలేము, అట్టి పెట్టుకోలేము... ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీ వల్ల...

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు రిటెన్షన్ కార్యక్రమం, నవంబర్ 30న జరగనుంది. ఏ ప్లేయర్‌, పాత ఫ్రాంఛైజీతో కొనసాగుతాడో, ఏ ప్లేయర్లు మెగా వేలంలో పాల్గొనబోతారో ఈ కార్యక్రమం ద్వారా స్పష్టత రానుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 30 2021, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీలో భాగంగా పాత ఫ్రాంఛైజీలకు మహా అయితే నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది... దీంతో ఫ్రాంఛైజీలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తే, ఆ జట్టు రూ.42 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడాల్సిందే. ప్లేయర్ 1కి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.12 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

313

నాలుగో ప్లేయర్‌కి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్‌లను అట్టిపెట్టుకోవాలని అనుకుంటే....

413

రోహిత్ శర్మకు రూ.16 కోట్లు, జస్ప్రిత్ బుమ్రాకి రూ.12 కోట్లు, కిరన్ పోలార్డ్‌కి రూ.8 కోట్లు, ఇషాన్ కిషన్‌కి రూ.6 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది...

513

ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో రూ.90 కోట్లు ఉంటాయి. వీటిలో నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటంది. అంటే మిగిలిన రూ.48 కోట్లతో మిగిలిన జట్టును నిర్మించాల్సి వస్తుంది...

613

ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని ఫ్రాంఛైజీలు భావిస్తే రిటైన్షన్ ధరలు తగ్గుతాయి. ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్ల చొప్పున రూ.33 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది...

713

పాత ఫ్రాంఛైజీలు ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని అనుకుంటే, ఈ రేటు మరింత తగ్గుతుంది. మొదటి ప్లేయర్‌కి రూ.14 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.10 కోట్లు... మొత్తంగా రూ.24 కోట్లు పర్సులో నుంచి తగ్గించబడతాయి...

813

ఒకే ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవాలంటే రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌‌ని అట్టిపెట్టుకోవాలన్నా కూడా ఒక్కో ప్లేయర్‌కి రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రాంఛైజీలు...

913

అన్ క్యాప్డ్ ప్లేయర్లు అయినా, క్యాప్‌డ్ ప్లేయర్ అయినా సరే ముగ్గురు స్వదేశీ ప్లేయర్లకు మించి అట్టిపెట్టుకునేందుకు పాత ఫ్రాంఛైజీలకు అవకాశం ఉండదు. ఇద్దరు విదేశీ ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది...

1013

కొత్తగా వచ్చిన రెండు జట్లు, ఐపీఎల్ వేలానికి ముందు అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లను ‘ఫ్రీ టికెట్’ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది...

1113


ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాలని కొత్త ఫ్రాంఛైజీలు భావిస్తే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

1213

ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేస్తే మొదటి ప్లేయర్‌కి రూ.14 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకే ప్లేయర్‌ను కొనుగోలు చేస్తే రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

1313

అట్టిపెట్టుకోవాలని అనుకుంటే భారీ మొత్తం చెల్లించడానికి సిద్దంగా ఉండాలి. అలాగని స్టార్ ప్లేయర్లను వేలానికి వదిలి వేయలేని పరిస్థితి... మొత్తం మెగా వేలానికి ముందు పాత ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలనే విషయంపై చాలా పెద్ద హోంవర్క్ చేస్తున్నాయి...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved